Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, June 23, 2023

యూట్యూబ్ సొంత షాపింగ్ ఛానెల్‌ !

                                     

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ యాప్ అఫీషియల్‌గా సొంత షాపింగ్ ఛానెల్‌ ప్రారంభించనుంది. దక్షిణ కొరియాలో జూన్ 30న లాంచ్ కానున్న ఈ షాపింగ్ ఛానెల్‌ వివిధ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ విక్రయించడానికి లైవ్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. మొదట ఈ ఛానల్ దాదాపు 30 బ్రాండ్‌లకు చెందిన ప్రొడక్ట్స్‌ను కంపెనీ లైవ్‌లోకి తీసుకురానుంది. యూట్యూబ్ తొలిసారిగా లైవ్ షాపింగ్ ఛానల్‌ను ప్రారంభిస్తుండగా అందులో యూజర్లకు ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయనేది ఇంకా తెలియ రాలేదు. ఇటీవల ఒక యూట్యూబ్ ప్రతినిధి దీని గురించి మాట్లాడుతూ, వివిధ షాపింగ్ ఫీచర్లతో ప్రయోగాలు చేస్తూ బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. యూట్యూబ్ యూజర్లకు షాపింగ్‌ను సులభతరం చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిప్రాయపడ్డారు. ప్రకటనకర్తలు తమ వ్యయాన్ని తగ్గించుకోవడం, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి పోటీని ఎదుర్కోవడం వల్ల యూట్యూబ్ యాడ్ రెవిన్యూ తగ్గిందని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో క్రియేటర్లు, బ్రాండ్స్‌ నుంచి ప్రొడక్ట్స్‌ను, అలానే ఇష్టమైన కంటెంట్‌ను నేరుగా కొనుగోలు చేయడానికి యూజర్లను అనుమతిస్తే క్రియేటర్ల సంఖ్య పెరుగుతుందని అన్నారు. అప్పుడు అడ్వర్టైజర్లకు ఎక్కువ అవకాశాలు లభించి యూట్యూబ్‌ రెవిన్యూ పెరుగుతుందని వివరించారు. ఇక కొత్తగా రానున్న షాపింగ్ ఛానల్‌తో యూట్యూబ్ వీడియోలను చూస్తూ యూజర్లు తాము చూసిన వస్తువులను ఈజీగా కొనుగోలు చేయవచ్చు. మరోవైపు యూట్యూబ్ యాడ్ రెవెన్యూ వరుసగా మూడవ త్రైమాసికంలో క్షీణించింది. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో దాని రెవెన్యూ 2.6% తగ్గింది. కంపెనీ అంతకుముందు సంవత్సరం మార్చిలో 6.87 బిలియన్ డాలర్లు సంపాదించగా.. 2023, మార్చి కాలంలో 6.69 బిలియన్ డాలర్ల ప్రకటన రాబడిని ఆర్జించింది. అయితే యూట్యూబ్ షార్ట్స్ ఫీచర్‌లో ప్రకటనల ఎంగేజ్‌మెంట్, యాడ్స్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి రెవిన్యూ పెరిగే అవకాశం ఉందని కంపెనీ ఆశాజనకంగా ఉంది. దక్షిణ కొరియాలో ప్రముఖ టెక్ కంపెనీ అయిన నావర్ నేతృత్వంలో లైవ్ స్ట్రీమింగ్ కామర్స్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన యూట్యూబ్ సొంత లైవ్-కామర్స్ సామర్థ్యాలను పరీక్షించాలని, షాపింగ్ అనుభవాలను ప్రారంభించడంపై మరింత దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ప్లాట్‌ఫామ్ కొరియన్‌ భాషలో 90 రోజుల ప్రాజెక్ట్‌గా పనిచేస్తుంది. దక్షిణ కొరియాలో లైవ్-కామర్స్ మార్కెట్‌లోకి యూట్యూబ్ ప్రవేశిస్తున్న వేళ బుధవారం ఉదయం, నావర్ షేర్లు 4% క్షీణించగా, లోట్టే షాపింగ్ షేర్లు 3.3% పతనమయ్యాయి. దీనికి విరుద్ధంగా, విస్తృత మార్కెట్ 0.5% పడిపోయింది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts