Ad Code

దొంగలను పట్టించిన యాపిల్ ఎయిర్ ట్యాగ్ !


మెరికాలోని టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయి. సమాధుల్లో ఉంచిన వస్తువులను చోరీ చేయడం పరిపాటిగా మారింది. ఇలా కొన్ని వేల డాలర్ల సొత్తును స్థానికులు కోల్పోయారు. దీంతో దొంగతనాలకు చెక్ పెట్టాలని టోనీ వెలజ్‌కెజ్‌కి చెందిన ఫ్యామిలీ భావించింది. టెక్నాలజీ సాయంతో దొంగలను పట్టుకోవాలని వారు డిసైడ్ అయ్యారు. ఇందుకు అనుగుణంగా యాపిల్ ఎయిర్ ట్యాగ్‌ని గ్రేవ్‌లోని ఓ వస్తువులో రహస్యంగా దాచి పెట్టారు. ఊహించినట్లుగానే అక్కడికి దొంగలు చేరుకున్నారు. రోజూ చేస్తున్నట్టుగానే ఎయిర్ ట్యాగ్ ఉన్న వస్తువును దొంగిలించుకుని పారిపోయారు. ఎయిర్ ట్యాగ్ లాగిన్ వివరాలను టోనీ ఫ్యామిలీ పోలీసులకు అందించారు. తర్వాత 'ఫైండ్ మై యాప్' సహాయంతో ఎయిర్ ట్యాగ్ లొకేషన్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. దీంతో దొంగల గుట్టు వీడింది. ఘటనా స్థలం నుంచి 45 నిమిషాల దూరంలో ఉన్న ఓ ఇంట్లో ఎయిర్ ట్యాగ్ లొకేషన్‌ను అధికారులు గుర్తించారు. బ్రజోరియా టౌన్‌కి శివారులో ఈ ఇల్లు ఉండటాన్ని గమనించి హుటాహుటిన అక్కడికి పోలీసులు చేరుకున్నారు. తీరా వెళ్లి చూస్తే దుండగుల బండారం మొత్తం బయటపడింది. ఎయిర్ ట్యాగ్ ఉన్న వస్తువే కాకుండా అక్కడ వందల సంఖ్యలో దొంగిలించిన ఐటెమ్స్ ఉన్నాయి. అలా చోరీ చేసిన వస్తువుల విలువ 62 వేల డాలర్లు ఉంటుంది. ఈ వస్తువులను స్థానిక దుకాణాల్లో విక్రయించి డబ్బు సంపాదించాలనే ప్లాన్‌తో దొంగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాపిల్ ఎయిర్ ట్యాగ్ దొంగలను పట్టించడం ఇదే మొదటి సారి కాదు. టెక్సాస్‌లోని మరో కేసులో ఓ రెస్టారెంట్ యజమానికి ఎయిర్ ట్యాగ్ సాయం చేసింది. ఆరడుగుల ఎత్తున్న ఓ బుల్ విగ్రహాన్ని కనిపెట్టడంలో ఎయిర్ ట్యాగ్ సహాయ పడింది. మరో ఘటనలో, 11లక్షల డాలర్ల విలువైన సంపద కలిగిన ట్రక్‌ని రాబరీ కాకుండా కాపాడింది. డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు కూడా దర్యాప్తు కోసం ఈ ఎయిర్‌ట్యాగ్‌ని సక్సెస్‌ఫుల్‌గా వినియోగిస్తున్నారు. ఎయిర్ ట్యాగ్ టెక్నాలజీతో నేరస్థులను పట్టుకుంటున్నారు. ఈ ఎయిర్ ట్యాగ్ ట్రాకర్‌ను యాపిల్ 2021లో లాంచ్ చేసింది. ఇదొక బ్లూటూత్ ఆధారంగా పనిచేసే కాంపాక్ట్ డివైజ్. ఎయిర్ ట్యాగ్‌కి కనెక్ట్ కాగానే లొకేషన్ ఇన్ఫర్మేషన్‌ని ఐక్లౌడ్‌కి పంపిస్తుంది. ఫైండ్ మై యాప్ సహాయంతో యూజర్లు ఈ సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. తద్వారా ఎయిర్ ట్యాగ్ లొకేషన్‌ను మ్యాప్స్‌లో చూడొచ్చు. యూజర్ ప్రైవసీకి భంగం కలిగించకుండా యాపిల్ సంస్థ ఎయిర్ ట్యాగ్‌ను ఎన్‌క్రిప్ట్ చేసింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu