Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, June 6, 2023

ఆపిల్ ఫోన్లకు పోటీగా నోకియా కొత్త ఫోన్ ?


హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా మ్యాజిక్ మ్యాక్స్ అనే కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను పరిచయం చేయబోతోంది. ఈ మోడల్ లీక్ డిజైన్ ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.  లీక్ అయిన సమాచారం మేరకు ఈ నోకియా మ్యాజిక్ మ్యాక్స్ ఆగస్టు 24న లాంచ్ కానుందని నివేదికలు తెలియచేస్తున్నాయి. కానీ హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ మాత్రం ఈ కొత్త ఫోన్‌ను విడుదల చేసే అధికారిక తేదీని ప్రకటించకపోవడం గమనార్హం. అందుకే ఈ తేదీని కేవలం అంచనా తేదీ గా ఎంటరమే భావించాలి, ఎందుకంటే దీనిని సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ నోకియా మ్యాజిక్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా ఐఫోన్లకు పోటీగా పలు ప్రత్యేక ఫీచర్లతో రాబోతోంది. ఈ ఫోన్ ఇప్పటికే, ఇండియాలో భారీ అంచనాలను సృష్టించింది. నోకియా మ్యాజిక్ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పెద్ద డిస్ప్లే ఉపయోగించడానికి చాలా బాగుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. క్వాల్‌కామ్ తాజా హై-ఎండ్ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుందని నివేదికలు తెలియచేస్తున్నాయి. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడానికి చాలా బాగుంది. ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరును అందించడం ప్రత్యేకమైన అంశంగా గుర్తించవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతుంది. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ 8GB/12GB/16GB RAM మరియు 256GB/512GB స్టోరేజీ ఎంపికలను కలిగి ఉంది. ఈ ఫోన్ లో మెమరీ కార్డ్ ను ఉపయోగించడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ మద్దతుతో కూడా వస్తుంది. 44MP మెయిన్ సెన్సార్ + 64MP అల్ట్రా-వైడ్ లెన్స్ + 48MP టెలిఫోటో కెమెరా తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వస్తుంది. కాబట్టి మీరు ఈ స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఖచ్చితమైన ఫోటోలు మరియు వీడియోలను తీసుకోవచ్చు. తరువాత ఈ కొత్త ఫోన్ వివిధ కెమెరా ఫీచర్లు మరియు LED ఫ్లాష్ సపోర్ట్‌తో లాంచ్ చేయబడుతుంది. ఈ ఫోన్ ఎక్కువ కాలం బ్యాటరీ బ్యాకప్ అందించగల బ్యాటరీ సదుపాయం కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ను కూడా కలిగి ఉండటం గమనించదగ్గ విషయం. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ నోకియా మ్యాజిక్ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో లాంచ్ అవుతుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ నుంచి వస్తున్ననోకియా మ్యాజిక్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ అన్ని ఫీచర్లు గొప్పగా ప్రీమియం ఫోన్లతో పోలి ఉండడంతో ధర కాస్త ఎక్కువగానే ఉండవచ్చని అంచనాలున్నాయి. ముఖ్యంగా భారత మార్కెట్లో ఈ నోకియా మ్యాజిక్ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ భారీ అంచనాలను సృష్టిస్తుంది అని రిపోర్టులు చెప్తున్నాయి. offerbazar24/7

No comments:

Post a Comment

Popular Posts