Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, June 24, 2023

పీడీఎఫ్‌ ఇమేజ్‌లను టెక్స్ట్‌గా మార్చే టూల్ !


గూగుల్  ఏఐ టెక్నాలజీ సాయంతో యూజర్లకు అత్యంత ఉపయోగకరమైన ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా మరొక ఏఐ ఆధారిత ఫీచర్‌ను తీసుకురానుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కోసం ఒక ఇన్-బిల్ట్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. అంధులు, తక్కువ చూపు ఉన్నవారు లేదా స్క్రీన్ రీడర్లపై ఆధారపడే వ్యక్తులకు రీడింగ్ యాక్సెసిబిలిటీని ఇది మెరుగుపర్చనుంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులు PDFలను మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ఈ ఫీచర్ సహాయం చేస్తుంది. ఇమేజ్-టు-టెక్స్ట్ అని పిలిచే ఫీచర్ కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ను ChromeOS కోసం క్రోమ్ బ్రౌజర్‌లో తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో స్క్రీన్ రీడర్ యూజర్లు ఆల్ట్ టెక్స్ట్ లేని PDFని చదువుతున్నప్పుడు.. స్క్రీన్ రీడర్ అనేది ఆ ఇమేజ్‌లను టెక్స్ట్‌గా మారుస్తుంది. వాటిని బిగ్గరగా చదవగలదు. AI ఇమేజ్ కంటెంట్లను విశ్లేషించి, దానిలో ఏముందో గుర్తిస్తుంది. దానిని టెక్స్ట్‌గా మార్చడానికి OCR టెక్నాలజీని వినియోగిస్తుంది. సిస్టమ్ మెషీన్ యాక్సెస్ చేయగల టెక్స్ట్‌ను జనరేట్ చేస్తుంది. అది స్క్రీన్ రీడర్ ద్వారా యూజర్‌కు డిస్‌ప్లే అవుతుంది. అలా ఇమేజ్‌లకు సరైన వివరణలు లేకపోయినా, స్క్రీన్ రీడర్‌లపై ఆధారపడే వ్యక్తులు PDFలను యాక్సెస్ చేసుకోవచ్చు.గూగుల్ ఇప్పుడు 'గెట్ ఇమేజ్ డిస్క్రిప్షన్స్‌' ఫీచర్‌ను మెరుగుపరుస్తోంది. ఇది క్రొయేషియన్, చెక్, డచ్, ఇంగ్లీష్, ఫిన్నిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, నార్వేజియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, స్వీడిష్, టర్కిష్ వంటి అనేక భాషలలో ఇమేజ్ డిస్క్రిప్షన్స్‌ అందిస్తుంది. ఇన్ని భాషలకు సపోర్టు ఉండటం వల్ల స్క్రీన్ రీడర్లను ఉపయోగించే వ్యక్తులు మరిన్ని భాషల్లో ఇమేజ్ డిస్క్రిప్షన్స్‌ పొందడం సాధ్యమవుతుంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులు మిస్సింగ్ లేదా ఇన్‌కంప్లీట్‌గా ఉన్న ఆల్ట్ టెక్స్ట్ కారణంగా PDFs అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇమేజ్-టు-టెక్స్ట్ టెక్నాలజీ ఆల్ట్ టెక్స్ట్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కంపెనీ మార్చిలో ప్రకటించిన 'రీడింగ్ మోడ్ (Reading mode)' టూల్‌ను క్రోమ్ బ్రౌజర్‌లో కూడా తీసుకువస్తోంది. ఈ టూల్ విద్యార్థులు టెక్స్ట్‌ను పెద్దదిగా చేయడం, ఫాంట్‌ను మార్చడం, డిస్‌ట్రాక్షన్స్ తొలగించడం ద్వారా చదవడాన్ని సులభతరం చేస్తుంది. Chrome ఇప్పటికే ChromeOSలో దాని రీడింగ్ మోడ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు గూగుల్ ఈ ఫీచర్‌ను అన్ని కంప్యూటర్‌లలోని బ్రౌజర్‌కు విస్తరిస్తోంది. దీనివల్ల చాలామంది యూజర్లు ప్రయోజనం పొందుతారు.

No comments:

Post a Comment

Popular Posts