Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, June 26, 2023

పొరపాట్లు నిజమేనని బైజూస్ సీఈఓ అంగీకారం

                                             

ఎడ్-టెక్ స్టార్టప్ 'బైజూ'స్ ఏడాది కాలంగా పలు ఆర్థిక, యాజమాన్య సమస్యలతో సతమతం అవుతున్నది. 1.2 బిలియన్ డాలర్ల రుణం చెల్లింపు, ముగ్గురు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల రాజీనామా, గత ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిలో జాప్యం తదితర కారణాలతో సంక్షోభంలో చిక్కుకున్నది. గత ఏడాది కాలంగా సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు బైజూస్ సీఈఓ బైజూ రవీంద్రన్ అంగీకరించారు. మరి కొంత మంది స్వతంత్ర డైరెక్టర్ల నియామకంపై ఫోకస్ చేశామని ఇటీవల జరిగిన సంస్థ వాటాదారుల సమావేశంలో రవీంద్రన్ చెప్పినట్లు సమాచారం. సెప్టెంబర్ నాటికి 2021-22 ఆర్థిక సంవత్సర అడిటింగ్, 2022-23 అడిటింగ్ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని సంస్థ సీఎఫ్ఓ అజయ్ గోయల్ సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం. గత నెలలో సంస్థ సీఎఫ్ఓగా నియమితులైనప్పటి నుంచి అజయ్ గోయల్.. సంస్థ వాటాదారులతో మాట్లాడటం ఇదే తొలిసారి. అడిటెడ్ ఆర్థిక ఫలితాలను త్వరితగతిన బయట పెట్టడమే తన తొలి ప్రాధాన్యం అని ఆయన చెప్పినట్లు బైజూస్ వర్గాల కథనం. ఆర్థిక ఫలితాలను సమర్పించడంలో ఆలస్యాన్ని సాకుగా చూపి బైజూస్ అడిటర్స్‌గా డెల్లాయిట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు 2025 వరకు బైజూ'స్ అడిటర్ గా డెల్లాయిట్ ఉన్నా.. ఆర్థిక ఫలితాల వెల్లడిలో జాప్యం నేపథ్యంలో మధ్యలోనే ఆడిటర్ గా వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త అడిటర్‌గా 'బీడీఓ'ను బైజూస్ నియమించుకున్నది. ఇదిలా ఉంటే, ముగ్గురు డైరెక్టర్ల రాజీనామాలను కంపెనీ బోర్డు ఆమోదించలేదని బైజూ రవీంద్రన్ సమావేశంలో చెప్పారని సమాచారం. బైజూస్ బోర్డు డైరెక్టర్లుగా పీక్ ఎక్స్ వీ పార్టనర్స్ జీవీ రవిశంకర్, రస్సెల్ డ్రైసెన్, వివియాన్ వూ, బోర్డు డైరెక్టర్లు రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts