Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, June 16, 2023

రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ ?


ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లు అన్నీ నాన్-రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మరోసారి రిమూవబుల్ బ్యాటరీలు మొబైల్ ఫోన్లలో తిరిగి రావచ్చు. దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్ ఒక చట్టాన్ని ఆమోదించింది. మొబైల్ ఫోన్ కంపెనీలు నాన్ రిమూవబుల్ బ్యాటరీలతో వచ్చే స్మార్ట్ ఫోన్లను విక్రయించడానికి అనుమతి ఉండదు. ప్రస్తుతం ఈ చట్టానికి యూరోపియన్ యూనియన్ లో  ఆమోదం లభించింది. అంటే ఇక్కడి వినియోగదారులు రాబోయే కాలంలో స్మార్ట్ ఫోన్ బ్యాటరీని సులభంగా చేత్తో తీసేయచ్చన్న మాట. ఈ కొత్త చట్టం నేటి నుంచి మూడేళ్ల తర్వాత అమల్లోకి రానుంది. అంటే 2027 నుంచి యూరోపియన్ యూనియన్ దేశాల్లో విక్రయించే స్మార్ట్ ఫోన్లలో రిమూవబుల్ బ్యాటరీలు అందుబాటులో ఉంటాయి. యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ-వ్యర్థాలను తగ్గించి పర్యావరణానికి హాని కలగకుండా కాపాడేందుకు యూరోపియన్ యూనియన్ కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో యూరోప్ చాలా పెద్ద మార్కెట్. కంపెనీలు యూరోప్ కోసం ఒక మోడల్, మిగతా దేశాల కోసం మరో మోడల్ స్మార్ట్ ఫోన్లను తయారు చేయడం కష్టం. కాబట్టి త్వరలో ప్రపంచవ్యాప్తంగా రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొబైల్ ఛార్జర్ లేదా బ్యాటరీకి సంబంధించి యూరోపియన్ యూనియన్ చట్టాన్ని రూపొందించడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్కు సంబంధించిన నియమాన్ని ఆమోదించింది. ఈ చట్టానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 2025 నుంచి ఫోన్లో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ను అందించాలని భారత ప్రభుత్వం కూడా అన్ని మొబైల్ కంపెనీలను కోరింది. ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం వినియోగదారుల ఖర్చులతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం కూడా.  https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts