ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ కొమాకి రేంజ్ ఎకో, స్పోర్ట్, స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ అనే 3 వేరియంట్‌లలో తీసుకొచ్చింది. Komaki SE ఎకో కోసం 75-90km, Komaki SE స్పోర్ట్ కోసం 110-140km, Komaki SE స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ కోసం 150-180km పరిధిగా అందిస్తుంది. 2023 Komaki SE ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింద విధంగా ఉన్నాయి. Komaki SE Eco : రూ. 96,968, Komaki SE స్పోర్ట్ : రూ. 1,29,938, Komaki SE స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ : రూ. 1,38,427. కొమాకి ఎకో స్పీడ్ లిమిట్ 55-60km అయితే, Komaki SE స్పోర్ట్, Komaki SE స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ 75-80km వేగాన్ని అందిస్తుంది.ఎలక్ట్రిక్ స్కూటర్ LiFePO4 బ్యాటరీతో 3kW హబ్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో ఎకో, స్పోర్ట్ టర్బో అనే 3 రైడ్ మోడ్‌లు ఉన్నాయి. అందులో SE 20-లీటర్ బూట్‌ను కలిగి ఉంది. 2023 కొమాకి SE పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. LED ఫ్రంట్ వింకర్‌లు, LED DRLలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ ఆపరేషన్, యాంటీ-స్కిడ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం TFT స్క్రీన్ ఆన్‌బోర్డ్ విగేషన్, సౌండ్ సిస్టమ్, కాలింగ్ ఆప్షన్‌లను అందిస్తుంది. కొమాకి SE ఇప్పటికే కొనుగోలుదారులకు ఇష్టమైన ఆప్షన్లలో ఒకటిగా ఉంది. ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో స్టైల్‌తో క్లీన్ అండ్ సేఫ్ రైడ్ సెర్చ్ చేస్తున్న రైడర్‌లకు ఇది కచ్చితంగా సరైన ఆప్షన్ అందిస్తుందని డైరెక్టర్, గుంజన్ మల్హోత్రా అన్నారు. https://t.me/offerbazaramzon
0 Comments