Ad Code

గూగుల్‌పై ఉద్యోగుల అసహనం !

                                   

ఇంటి నుంచి పనిచేసేందుకు అలవాటుపడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడంలో గూగుల్ సతమతమవుతోంది. హైబ్రిడ్ మోడల్‌లో భాగంగా ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాల నుంచి పనిచేయాలని గూగుల్ కోరుతుండగా పలువురు ఉద్యోగులు పెడచెవిన పెడుతున్నారు. ఉద్యోగుల హాజరు, కార్యాలయంలో సిబ్బంది కదలికలను ట్రాక్ చేస్తూ పెర్ఫామెన్స్ రివ్యూ సందర్భంగా గ్రేడింగ్ ఉంటుందని కంపెనీ హెచ్చరించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గూగుల్ వార్నింగ్‌ను సీరియస్‌గా తీసుకోని ఉద్యోగులు కంపెనీ తమను స్కూల్ పిల్లల్లా ట్రీట్ చేస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైబ్రిడ్ వర్క్ మోడ్‌కు తాము పూర్తిగా మారిపోయామని, టీమ్ లీడర్లు వారి టీం సభ్యులు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను ఎలా అనుసరిస్తున్నారనే రిపోర్ట్స్‌ను పరిశీలిస్తారని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. గూగుల్‌లో మాస్ లేఆఫ్స్ అనంతరం హైబ్రిడ్ వర్క్ పాలసీలో మార్పులు చేపట్టారు. వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాల నుంచి ఉద్యోగులు విధిగా పనిచేయాలని సెర్చింజన్ దిగ్గజం స్పష్టం చేస్తోంది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరించని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే విస్పష్ట సంకేతాలు పంపింది. రిటన్ టూ ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులు పేలవమైన పెర్ఫామెన్స్ రివ్యూ పొందుతారని హెచ్చరించింది. పెర్ఫామెన్స్ రివ్యూ సందర్భంగా ఉద్యోగుల హాజరును తనిఖీ చేస్తామని తేల్చిచెప్పింది. గూగుల్ కార్యాలయాలకు ఉద్యోగులు విధిగా రావాలని, రిమోట్ వర్కర్లు హైబ్రిడ్ వర్క్ షెడ్యూల్ అనుసరించాలని, బృందంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియాన సిసోని పేర్కొన్నారు. అమెరికాలో బ్యాడ్జ్ డేటా ఆధారంగా కార్యాలయాలకు ఉద్యోగుల హాజరును గూగుల్ పర్యవేక్షించనుండగా, ఇతర దేశాల్లోనూ ఈ దిశగా సెర్చింజన్ దిగ్గజం కసరత్తు సాగిస్తోంది. హైబ్రిడ్ మోడల్ పాలసీని వరుసగా ఉల్లంఘిస్తున్న ఉద్యోగులతో హెచ్ఆర్ వర్గాలు మాట్లాడి తదుపరి చర్యలకు సిద్ధం కానున్నాయి. మైక్రోసాఫ్ట్‌, ఓపెన్ఏఐ వంటి ప్రత్యర్ధుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పోటీ ఎదురవుతున్న సమయంలో వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీకి కట్టుబడాలని ఉద్యోగులపై గూగుల్ ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu