Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, June 6, 2023

జీ మెయిల్ లో టాప్ రిజల్ట్స్ ఫీచర్ !


జీ మెయిల్ స్మార్ట్ ఫోన్ వెర్షన్ లో మరో అద్బుతమైన సూపర్ ఫీచర్ ను గూగుల్ లాంచ్ చేయనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ యూజర్లకు పాత ఫైళ్లను వెతకడంలో చాలా బాగా సహాయపడుతుంది.అత్యంత కచ్చితత్వంతో, సులభంగా మెయిల్స్, ఫైల్స్, ఇంకా డాక్యుమెంట్స్ వెతకడంలో సహాయపడుతుందని గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ తన బ్లాగ్ స్పాట్ లో తెలిపింది. స్మార్ట్ ఫోన్ లో  జీమెయిల్ వాడే వారు యాప్ పైన 'టాప్ రిజల్ట్స్' అనే సెక్షన్ ని గమనించవచ్చు. ఈ సెక్షన్లోకి వెళ్లి పాత మెసేజ్ లు, మెయిల్స్ ఇంకా అటాచ్మెంట్స్ ని సులభంగా వెతకవచ్చు. ఈ సెక్షన్ లో ఫైల్స్ వెతకడానికి గూగుల్ లోని మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ సహాయం చేస్తాయి. మీరు వెతకాలనుకుంటున్న దానికి సంబంధించిన అంశాలను ఏదో ఒకటి యాడ్ చేసి సెర్చ్ చేసి మీ మెయిల్స్ ను పొందవచ్చు. ఈ ఫీచర్ కోసం చాలా మంది యూజర్లు అభ్యర్థిచారని గూగుల్ తన బ్లాక్ స్పాట్ లో పేర్కొంది. రానున్న రెండు వారాల్లో పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి వస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ టాప్ రిజల్ట్స్ అనే ఫీచర్ ప్రస్తుతం కేవలం మొబైల్ వెర్షన్లోనే మనకు అందుబాటులో ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. మరి బ్రౌజర్ ఆధారిత జీ మెయిల్ వెర్షన్ కి ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.సెర్చ్ జెయింట్ గూగుల్ 2023 మే నెలలో జరిగిన ఐ/ఓ డెవలపర్ కాన్ఫరెన్స్ లో పలు కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది. ఇంకా అలాగే ఓపెన్ ఏఐ ప్రారంభించిన చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ తీసుకొచ్చిన బార్డ్ త్వరలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లింక్ కానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.offerbazar24/7

No comments:

Post a Comment

Popular Posts