Ad Code

ఫ్రిజ్ డోర్ తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?


దాదాపు ప్రతి ఇంట్లో ఏసీ, కూలర్ ఉన్నా లేకున్నా ఫ్రిడ్జ్ మాత్రం ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు చల్లగా ఉంటుంది. కాసేపు అలానే ఓపెన్ చేసి ఉంచితే ఇంకాస్త చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే కాసేపు ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఉంచగానే ఇంట్లో వాళ్లు తిడతారు.. ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయమంటారు. అయితే తెరవగానే చల్లగా ఉండే ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయాలనిపించదు. కానీ అలా ఓపెన్ చేసే ఉంచితే రూమ్ కూల్ అవుతుందా..?  ఫ్రిడ్జ్ డోర్ తెరిచిన తర్వాత అందులోని సెన్సార్లు గది ఉష్ణోగ్రతను కొలవడం ప్రారంభిస్తాయి. అలాంటి పరిస్థితిలో, ఫ్రిజ్ మరింత కూలింగ్ అవసరమని భావిస్తుంది. ఫ్రిజ్ కూడా ఆ గదిలో భాగమైపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇప్పుడు అది కంప్రెసర్‌కి లోపల వేడి చాలా పెరిగిందని, శీతలకరణ మరింత అవసరం అని చెబుతుంది. అప్పుడు కంప్రెసర్ ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. శీతలకరణ, కంప్రెసర్ రెండూ కలిసి గతంలో కంటే ఎక్కువ వేడిని గదిలోకి పంపుతాయి.  అంటే కాసేపటి తర్వాత రూమ్ మరింత వేడిగా ఉంటుంది. అందుకే ఫ్రిడ్జ్ డోర్ ఎక్కువ సేపు తెరిచి ఉంచడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. అలా ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఉంచడం వల్ల రూమ్ కూల్ అవ్వదు కదా, ఫ్రిడ్జ్ లోని ఐటెమ్స్ పాడైపోతాయి.

Post a Comment

0 Comments

Close Menu