సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి మంగళవారం గల్లంతయ్యింది. ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే.. ప్రముఖ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సర్వీస్ టైటాన్ యాత్రకు కమ్యునికేషన్ సర్వీస్‌ను అందిస్తోంది. దీంతో స్టార్‌లింక్ సర్వీస్ నిర్వాహణ తీరుపై కూడా విమర్శలు ఎదురువుతున్నాయి. జలాంతర్గామి గల్లంతవడానికి ఇంటర్నెట్ ఒకటే సమస్య అని ఖచ్చితంగా చెప్పలేం. ఇతర సాంకేతిక సమస్యలు కూడా ఉండొచ్చు. కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత కూడా సబ్‌మెరైన్ పైకి రావడానికి కావాల్సిన వ్యవస్థ అందులో ఉంది. కానీ ఇప్పటివరకు జలాంతర్గామి జాడ తెలియకపోవడం ఇతర టెక్నికల్ సమస్యలను సూచిస్తోంది. ఈ ప్రమాదంపై కమాండ్ షిప్‌లో విధులు నిర్వహించిన డేవిడ్ పోగ్ మరో కోణాన్ని వెల్లడించారు. జలాంతర్గామికి కమ్యూనికేషన్ పోయిన తర్వాత కూడా షార్ట్ మెసేజ్ చేయడానికి అవకాశం ఉంటుందని పోగ్ తెలిపారు. కానీ అదేమీ జరగలేదని చెప్పారు. అయితే.. సబ్‌మెరైన్ పరిస్థితులను బయటకు చెప్పకుండా కమాండ్ షిప్‌లో ఇంటర్నెట్‌ను నిలుపుదల చేస్తారని చెప్పారు. జలాంతర్గామి వెళ్లదలచిన లోతుపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఓషన్‌గేట్‌కు చెందిన ఉద్యోగి డేవిడ్ లిచర్డ్ తెలిపారు. గతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షాంపిల్స్‌లో కూడా ఆయన అనేక లోపాలను గుర్తించినట్లు చెప్పారు. 4 వేల మీటర్ల వరకు జలాంతర్గామిని తీసుకువెళ్లడానికి సంస్థ నిర్ణయించింది. కానీ 1300 మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై మాట్లాడిన ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు డేవిడ్ తెలిపారు. చర్చలతో ఆ వివాదం ముగిసినట్లు వెల్లడించారు. ఏదేమైనా ప్రస్తుతం జలాంతర్గామి గల్లంతవడంతో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఈ అంశంపై స్టార్ లింక్ సంస్థ గానీ, ఎలాన్ మస్క్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. మరి.. కమ్యునికేషన్ అంశంలో లోపాలపై ఎలాన్ మస్క్ సంస్థ స్టార్ లింక్‌కు కూడా ఇది పెద్ద వైఫల్యంగా మారుతుంది.
0 Comments