20వ శతాబ్దంలో మనిషి జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చిన ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఎన్నో పనులు సులభతరం చేసిన స్మార్ట్‌ఫోన్ విభిన్న రూపాల్లో వస్తూ రూపులు మార్చుకుంటూ యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. అయితే దీని వాడకానికి మాత్రం ఇంటర్నెట్ తప్పనిసరి. అదే స్మార్ట్ఫోన్ల సంఖ్యతో పాటు ఇంటర్నెట్ యూజర్లను పెంచుతోంది. 2030 నాటికి ఇండియాలో యాప్‌ల కోసం చేసే ఖర్చు సుమారు రూ.64 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ నివేదిక జులై 1న వెల్లడించింది. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బీఐఎఫ్) నివేదిక ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి దాదాపు 6,600 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, యాప్ ఖర్చు జీడీపీలో 12 శాతంగా ఉంటుందని అంచనా. యాప్ ఎకానమీలో 32 శాతం వృద్ధి గమనించారు. ఇది జీడీపీకి నాలుగు రెట్లు ఎక్కువ. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భారీ పెరుగుదలను ఇది సూచిస్తోంది. ఈ నివేదికను ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. "యాప్‌లు డిజిటల్ ఎకానమీలో అంతర్భాగంగా ఉన్నాయి. అవి వ్యక్తులు, వ్యాపారాలు, ప్రభుత్వాలకు డేటా అందిస్తాయి. అవి మొత్తం ఉత్పాదకత, జీడీపీపై సానుకూల ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్నాం" అని బీఐఎఫ్ చైర్‌పర్సన్ అరుణా సుందరరాజన్ అన్నారు. భారతదేశంలో క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో సహా మొత్తం డిజిటల్ లావాదేవీలలో దాదాపు 85 శాతం యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. https://t.me/offerbazaramzon
0 Comments