Ad Code

రేపు దేశీయ మార్కెట్లోకి రియల్‌మి సీ53 విడుదల


దేశీయ మార్కెట్లోకి రియల్‌మి సీ53 రేపు రాబోతోంది. బడ్జెట్ ధరలో 108 ఎంపీ కెమెరా ఫీచర్‌తో కంపెనీ మార్కెట్‌లోకి తీసుకువస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొనుగోలుకు అందుబాటులోఉంటుంది. కంపెనీ యార్లీ బర్డ్ సేల్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్ ఇస్తుంది. 6 జీబీ ర్యామ్ 64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా ఆఫర్ పొందొచ్చు. ఈఎంఐ ఆప్షన్లు కూడా లభిస్తాయి. 7.99 ఎంఎం మందంతో ఉంటుంది. ఇంకా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు ఉంది. అలాగే 12 జీబీ డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. అలాగే మెమరీ 128 జీబీ వరకు ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. 18 వాట్ సూప్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయెల్ రియర్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్, ఆక్టో కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే ఫోన్‌లో సూపర్ డూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇకపోతే ధర ఎంతనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ రేటు అందుబాటు ధరలో ఉండచ్చనే అంచనాలు ఉన్నాయి. ఫోన్ స్క్రీన్ సైజ్ 6.74 ఇంచులు ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయనుంది. వెనుక భాగంలో 108 ఎంపీ, 2 ఎంపీ డ్యూయెల్ కెమెరా ఉండొచ్చు. ఫోన్ ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. 4 జీ సపోర్ట్ చేస్తుంది. అందువల్ల బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోరుకునే వారు ఈ ఫోన్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ధర అందుబాటులో ఉంటే కొనుగోలు చేయొచ్చు. లేదంటే మార్కెట్‌లో పలు రకాల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌లో నచ్చిన ఫోన్ ఎంపిక చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu