Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, July 5, 2023

సైబర్ క్రిమినల్స్‌గా బాలీవుడ్ విలన్స్ - AI క్రియేట్ చేసిన ఫోటోలు షేర్ చేసిన అస్సాం పోలీసులు


సైబర్ భద్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా అస్సాం పోలీసులు సైబర్ క్రిమినల్స్‌ను పోలిన బాలీవుడ్ విలన్స్ చిత్రాలను క్రియేట్ చేయమని ఏఐని అడిగారు. అలా క్రియేట్ అయిన చిత్రాల ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'ఐకానిక్ బాలీవుడ్ విలన్లను సైబర్ నేరగాళ్లుగా చూపించమని AI ని మేము కోరాము. బాలీవుడ్‌లోని ఆ విలన్స్‌ని మీరు గుర్తించగలిగితే రిప్లై చేయండి. థింక్ సైబర్ సేఫ్టీ' అనే క్యాప్షన్‌తో పోలీసులు షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. 'మొదటిది గబ్బర్ సింగ్, రెండు మొగాంబో, మూడు షకాల్, నాలుగు ప్రేమ్ చోప్రా' అని ఒకరు.. 'గబ్బర్ తప్ప అంతా హాలీవుడ్ విలన్స్‌లాగ కనిపిస్తున్నారు' అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. చాలామంది మిడ్‌జర్నీ మరియు DALL E వంటి టెక్స్ట్ ప్రాంప్ట్ టూల్స్ తమ పర్సనల్ లేదా వ్యాపార పనుల్లో భాగంగా ఉపయోగిస్తారు. అయితే సైబర్ క్రైమ్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అస్సాం పోలీసులు AI తయారు చేసిన బాలీవుడ్ సైబర్ క్రిమినల్స్ అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts