Ad Code

ఒడిశాలో సెమీకండక్టర్ యూనిట్ !


ఫాక్స్ కాన్-వేదాంత, మైక్రాన్ వంటి దిగ్గజ సెమికండక్టర్, చిప్ కంపెనీలు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా తాము ఇండియాలో పెట్టుబడి పెడుతున్నట్లు మైక్రాన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు యూకే కు చెందిన మరో కంపెనీ ఒడిశాలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మొత్తం రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులో మొదటి దశలో రూ. 30,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. SRAM & MRAM టెక్నాలజీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూకే అధారిత కంపెనీ. ఇది ఒడిశాలోని గంజాం జిల్లాలో సెమికండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశాయి. గంజాం జిల్లాలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆ జిల్లా కలెక్టర్ దిబ్యా జ్యోతి పరిదా పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరుపున హామీ ఇచ్చారు. ఈ యూనిట్ ను దాదాపుగా 800 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఇప్పటికే ఒడిశాలోని పలు జిల్లాలను సందర్శించినప్పటికీ.. గోపాల్‌పూర్ ఓడరేవు, ప్రత్యేక పారిశ్రామిక కారిడార్, ఎయిర్‌స్ట్రిప్ మరియు జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున గంజాం జిల్లాలోని ఛత్రపూర్ కి ప్రాధాన్యత ఇచ్చారు. రెండేళ్ళలో యూనిట్‌ని స్థాపించి 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి దాదాపు ₹ 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి తదుపరి దశల్లో యూనిట్‌ను విస్తరించాలని కూడా యోచిస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుత యుగంలో సెమికండక్టర్స్ చాలా కీ రోల్ పోషిస్తున్నాయి. మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సెమికండక్టర్లతో పనిచేస్తున్నాయి. మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్ సెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండిషనర్లు, కార్లకు చిప్ సెట్స్ అవసరం. ఏటా మన దేశం దాదాపు ₹ 3 లక్షల కోట్ల సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుంటోంది. కంపెనీలు భారత్ లో వెలిస్తే విదేశీ మారక ద్రవ్యం కాపాడుకోవచ్చు. టు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మొత్తం రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులో మొదటి దశలో రూ. 30,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. 
SRAM & MRAM టెక్నాలజీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూకే అధారిత కంపెనీ. ఇది ఒడిశాలోని గంజాం జిల్లాలో సెమికండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశాయి. గంజాం జిల్లాలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆ జిల్లా కలెక్టర్ దిబ్యా జ్యోతి పరిదా పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరుపున హామీ ఇచ్చారు. ఈ యూనిట్ ను దాదాపుగా 800 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఇప్పటికే ఒడిశాలోని పలు జిల్లాలను సందర్శించినప్పటికీ.. గోపాల్‌పూర్ ఓడరేవు, ప్రత్యేక పారిశ్రామిక కారిడార్, ఎయిర్‌స్ట్రిప్ మరియు జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున గంజాం జిల్లాలోని ఛత్రపూర్ కి ప్రాధాన్యత ఇచ్చారు. రెండేళ్ళలో యూనిట్‌ని స్థాపించి 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి దాదాపు ₹ 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి తదుపరి దశల్లో యూనిట్‌ను విస్తరించాలని కూడా యోచిస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుత యుగంలో సెమికండక్టర్స్ చాలా కీ రోల్ పోషిస్తున్నాయి. మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సెమికండక్టర్లతో పనిచేస్తున్నాయి. మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్ సెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండిషనర్లు, కార్లకు చిప్ సెట్స్ అవసరం. ఏటా మన దేశం దాదాపు ₹ 3 లక్షల కోట్ల సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుంటోంది. కంపెనీలు భారత్ లో వెలిస్తే విదేశీ మారక ద్రవ్యం కాపాడుకోవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu