Ad Code

బీఎస్‌ఎన్ఎల్ ఫైబర్ టు ద హోమ్ !


బీఎస్‌ఎన్ఎల్ ఫైబర్ టు ద హోమ్ సర్వీసులు అందిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా కస్టమర్లకు హైస్పీడ్ కనెక్టివిటీ అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా భారత్ ఫైబర్ తీసుకుంటే అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఎఫ్‌టీటీహెచ్ ప్లాన్‌లో భాగంగా ఈ సేవలు పొందొచ్చు. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బాండ్ కనెక్షన్ల ఇన్‌స్టాలేషన్ కోసం బీఎస్ఎన్ఎల్ ఇన్‌స్టాలేషన్ చార్జీలు తొలగించింది. కాపర్ కనెక్షన్ కోసం రూ. 250లను ఇన్‌స్టాలేషన్ చార్జీల రూపంలో తీసుకుంటుంది. అలాగే భారత్ ఫైబర్ కనెక్షన్ కోసం అయితే రూ. 500 వసూలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. నెల, ఆరు నెలలు, ఏడాది, 24 నెలలు చొప్పున ప్లాన్ ఎంచుకోవచ్చు. నెలవారీ ప్లాన్ ధర రూ. 329 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ప్లాన్ ద్వారా 1000 జీబీ డేటా పొందొచ్చు. స్పీడ్ 20 ఎంబీపీఎస్ ఉంటుంది. అపరిమిత డేటా డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ పేరు ఫైబర్ ఎంట్రీ. ఇది జూలై 30 వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల బీఎస్ఎన్ఎల్ వైఫై పొందాలని భావించే వారు ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu