Ad Code

త్వరలో 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం' !


'ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం' అనే సర్వీస్‌ను  ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్ త్వరలో లాంచ్‌ చేయనుంది. ప్రస్తుతం ఉన్న 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్'తో పోలిస్తే, దీనితో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ప్రోగ్రామ్‌ పేరును చూసి, ఈ సేవల కోసం సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం అందిస్తున్న కస్టమర్‌ బెనిఫిట్స్‌ ప్రోగ్రామ్‌ 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌'కి ఎక్స్‌టెన్షన్‌గా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం సర్వీస్‌ రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీని బెనిఫిట్స్‌, ఫీచర్‌లు ఇంకా పూర్తిగా తెలియలేదు. కంపెనీ కస్టమర్లను కొత్త సర్వీస్‌ రిలీజ్‌ ప్రకటనతో సర్‌ప్రైజ్‌ చేసింది. దాదాపు రెండు వారాల్లోనే ఈ కొత్త ప్రోగ్రామ్‌కి సంబంధించిన అన్ని వివరాలు కస్టమర్లకు తెలిసే అవకాశం ఉంది.  ఫ్రీ షిప్పింగ్, యాక్సలరేటెడ్‌ సూపర్‌కాయిన్స్‌ ఎర్నింగ్స్‌, డీల్స్‌కి ఎర్లీ యాక్సెస్‌, ప్రయారిటీ కస్టమర్‌ సపోర్ట్‌ సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ప్లాట్‌ఫామ్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.100తో, ప్లస్ మెంబర్స్ నాలుగు సూపర్‌కాయిన్స్ అందుకుంటారు. తరచుగా కొనుగోళ్లు చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే రాబోయే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియంతో, వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా మరింత మెరుగైన షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ పొందవచ్చని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియంను లాంచ్‌ చేసే పనులతో పాటు 'ఇండిపెండెన్స్ డే సేల్‌'ను తీసుకొచ్చే పనుల్లో ఉంది. ఈ సేల్ ఈవెంట్ కోసం దేశవ్యాప్తంగా షాపర్‌లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సేల్ భారీ డిస్కౌంట్‌లు, అద్భుతమైన డీల్స్‌ ఆఫర్‌ చేస్తుంది. ఇండిపెండెన్స్ డే సేల్ గురించి ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ, కొత్త ప్లస్ ప్రీమియం మెంబర్‌షిప్ లాంచ్ ఈ సేల్ పీరియడ్‌తో పాటు వచ్చే అవకాశం ఉంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu