Ad Code

యూట్యూబ్ లో స్టెబుల్ వాల్యూమ్ ఫీచర్‌ ?


యూట్యూబ్ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. కొద్ది రోజల క్రితం యాంబియంట్ మోడ్, డార్క్ థీమ్ లాంటి అదిరిపోయే అప్డేట్స్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు వీడియో సెట్టింగ్స్‌లో స్టెబుల్ వాల్యూమ్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను యూట్యూబ్ పరిచయం చేస్తోంది. దీంతో సడన్ చేంజ్‌లు లేదా వీడియో మొత్తం హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధంగా ఉండేలా సెట్ చేసుకునేలా అప్డేట్ చేసింది. ఇక, అధికారికంగా అనౌన్స్ చేయకముందే ఈ స్టెబుల్‌ వాల్యూమ్ సెట్టింగ్‌ వెలుగులోకి వచ్చింది. అయితే, సాధారణంగా యూట్యూబ్‌లోని ఒక్కో వీడియో ఒక్కో శబ్దంతో ప్లే అవుతుంది. ఒక వీడియో చాలా పెద్ద సౌండ్‌తో వస్తే.. మరికొన్ని తక్కువ సౌండ్‌తో ప్లే అవుతాయి. దీనివల్ల సౌండ్ పెంచుతూ, తగ్గిస్తూ ఉండాల్సి పరిస్తితి నెలకొంటుంది. అప్‌కమింగ్ స్టెబుల్‌ వాల్యూమ్ ఫీచర్‌తో అన్ని వీడియోలలో వాల్యూమ్‌ ఒకే విధంగా ఉండేలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. తద్వారా మనం సెట్ చేసుకున్న ఒకే సౌండ్‌తో అన్ని వీడియోలు ప్లే అవుతాయి. స్మార్ట్ టీవీలు, సౌండ్ సిస్టమ్స్‌, రోకు, ఇతర మీడియా ప్రొవైడర్లు ఇలాంటి ఫీచర్లను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాయి. యూట్యూబ్‌ కూడా ఈ సౌండ్ లెవలింగ్ ఫీచర్‌ను అతి త్వరలోనే లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీడియో సెట్టింగ్స్‌లో యాంబియంట్ మోడ్ కింద ఈ ఫీచర్ కనిపించబోతుందని ఓ యూట్యూబర్ తెలిపారు. స్టెబుల్‌ వాల్యూమ్ ఫీచర్ గురించి వస్తున్న ఊహాగానాలు నిజమైనవేనని యూట్యూబ్ కన్ఫర్మ్ చేసింది. అన్ని వీడియోల్లో వాల్యూమ్ ఆప్టిమైజ్ చేయడానికి ఈ ఫీచర్ ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్ల ద్వారా ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తున్నట్లు యూట్యూబ్ కు చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చి ఉంటే, దానిని యూట్యూబ్ యాప్‌లోని వీడియో సెట్టింగ్స్‌ పేజీలో యాక్సెస్ చేసుకోవచ్చు అని తెలిపాడు. ఈ నెల ప్రారంభంలో యూట్యూబ్ రెండు కొత్త ఫీచర్లను తీసుకోచ్చింది. అందులో లాక్ స్క్రీన్ ఒకటి. మొబైల్ యాప్ హోమ్ ఫీడ్‌లో ఏఐ జనరేటెడ్ క్విజ్‌లు అందించే మరో ఫీచర్‌ను కూడా యూట్యూబ్ ట్రయల్ వేస్తోంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu