Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, July 24, 2023

వచ్చేవారం ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త చాట్‌జీపీటీ యాప్ ?


పెన్ ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. iOS యూజర్ల కోసం చాట్‌జీపీటీ యాప్‌ను లాంచ్ చేసిన తర్వాత ఓపెన్ ఏఐ యాప్ ఆండ్రాయిడ్  వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ యాప్ ఇప్పటికే లో లిస్టు అయింది. వచ్చే వారమే చాట్‌జీపీటీ యాప్ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో ముందస్తు ఆర్డర్ చేయవచ్చని కంపెనీ ట్విట్టర్ ధృవీకరించింది. వచ్చే వారమే చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ వెర్షన్ లాంచ్ కానుందని కంపెనీ తెలిపింది. ఎప్పుడు లాంచ్ అనేది కంపెనీ కచ్చితమైన తేదీని పేర్కొనలేదు. కానీ, యాప్ లాంచ్ అయిన వెంటనే దాన్ని పొందడానికి గూగుల్ ప్లే స్టోర్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. తెలియని వారికి, చాట్‌జీపీటీ అనేది మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు. మీతో చాట్‌బాట్ సంభాషణలు చేయగలదు. మేలో iOS యూజర్లకు చాట్‌జీపీటీలాంచ్ అయినప్పటి నుంచి చాలా మంది ఆండ్రాయిడ్ వెర్షన్ యాప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాట్‌బాట్ రాకతో ప్రపంచంలో తీవ్ర పోటీ నెలకొంది. గూగుల్ బార్డ్, చాట్‌బాట్ ఆందోళనకు ఇదే కొంత కారణం ఉండవచ్చు. ChatGPT మాదరిగా కాకుండా బార్డ్‌లో ప్రత్యేక మొబైల్ యాప్‌లు లేవు. బదులుగా, వెబ్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌పై ఆధారపడుతుంది. కానీ, ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు మరో ఆప్షన్ ఉంటుంది. గేమ్‌ను వేగవంతం చేసేందుకు బార్డ్‌పై కొంత ఒత్తిడి తీసుకురావచ్చు. మీరు ChatGPT Android యాప్ కోసం వేచి ఉండలేకపోతే.. ఇప్పటికే Microsoft Bing యాప్‌ని వినియోగించవచ్చు. బింగ్ ప్రోమెథియస్ మోడల్ GPT-4ని ఉపయోగించి ఫిబ్రవరి నుంచి Android, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts