ఈనెల 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు ముందు యూజర్లకు కస్టమైజ్ ప్రొడక్ట్స్‌ను ఆఫర్ చేసేలా న్యూ ఫీచర్‌ను ఈకామర్స్ దిగ్గజం ప్రవేశపెట్టింది. గిఫ్ట్‌లు, వ్యక్తిగత వాడకం కోసం ఉత్పత్తుల కొనుగోలుకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కస్టమైజేషన్‌లో ప్రధానంగా కలర్స్ ఛాయిస్‌తో పాటు ఇమేజ్‌లు, ఇన్‌స్క్రిప్షన్స్ ఇవ్వడం వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కస్టమర్లు టెక్ట్స్ ఫాంట్‌ను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కస్టమైజేషన్, పర్సనలైజేషన్‌కు అర్హమైన ప్రోడక్టులకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. 76 క్యాటగిరీలకు చెందిన 10,000కుపైగా ప్రోడక్టులపై ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పర్సనలైజేషన్ కోసం అర్హమైన ఉత్పత్తులను గుర్తించేందుకు డెడికేటెడ్ విభాగం లేకున్నా యూజర్లు సెర్చ్ రిజల్ట్స్‌లో పర్సనలైజ్ ఇట్ అనే బ్యాడ్జ్‌ను గుర్తిస్తారు. ప్రొడక్ట్ పేజీల్లో కస్టమైజ్ నౌ అనే బటన్‌ను ప్రెస్ చేయవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. https://t.me/offerbazaramzon
0 Comments