బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బాండ్ సర్వీసులు పొందాలని భావించే వారికి తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. నెలకు కేవలం రూ. 329తోనే ప్లాన్ పొందొచ్చు. ఇంట్లో వైఫై పొందాలని భావించే వారు ఈ సేవలు పొందొచ్చు. బీఎస్ఎన్ఎల్ సర్వీసులు చాలా గ్రామాల్లో అందుబాటులో ఉంటాయి. అందువల్ల వైఫై సర్వీసులు కోరుకునే వారు బీఎస్ఎన్ఎల్ సర్వీసులు పొందొచ్చు. తక్కువ ధరకే రీచార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ ప్లాన్ ధర నెలకు రూ. 329 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ప్లాన్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల వెంటనే ఈ డీల్ పొందొచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కింద ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చొ మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో మీరు డేటా పొందొచ్చు. నెలకు 1000 జీబీ డేటా వరకు వస్తుంది. ఈ లిమిట్ దాటితే స్పీడ్ 4 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ ప్లాన్ ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత డేటా డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ కింద లోకల్, ఎస్‌టీ కాల్స్ చేసుకోవచ్చు. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా పొందాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఈ సేవలు పొందొచ్చు. అదే 6 నెలల వరకు ఈ ప్లాన్ పొందాలని భావిస్తే.. రూ.1810 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఏడాది కాలానికి కూడా మీరు ఈ ప్లాన్ పొందొచ్చు. రూ. 3948 చెల్లించి ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాది పాటు ఈ ప్లాన్ పొందితే.. ఒక నెల ఉచితంగా ఈ సేవలు పొందొచ్చు. అలాగే 24 నెలల టెన్యూర్‌కు కూడా ఈ ప్లాన్ ఉంటుంది. మీరు రెండేళ్ల టెన్యూరన్‌తో రీచార్జ్ చేసుకుంటే రనూ. 7896 చెల్లించాలి. ఈ ప్లాన్ కింద 3 నెలల పాటు ఉచితంగా సేవలు పొందొచ్చు. ఇంకా ఇతర ప్లాన్స్ కూడా ఉన్నాయి. రెండేళ్ల టెన్యూర్ అయితే 3 నెలల వరకు సర్వీస్ ఉచితంగా పొందొచ్చు.
0 Comments