Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, August 29, 2023

ఫ్లిప్‌కార్ట్ లో యాడ్‌సన్ కంపెనీ స్మార్ట్ టీవీపై 63 శాతం తగ్గింపు !


ఫ్లిప్‌కార్ట్ లో యాడ్‌సన్ కంపెనీ స్మార్ట్ టీవీపై అద్దిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా మీరు 22 వేల స్మార్ట్ టీవీని కేవలం 7 వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ టీవీలోని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలను చూస్తే.. యాడ్‌సన్ కంపెనీకి చెందిన 32 ఇంచుల యాడ్‌సన్ 80 సీఎం స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ ఈ భారీ తగ్గింపు ఆఫర్‌ని అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఆసలు ధర రూ. 21,999గా ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ద్వారా మీరు కేవలం 7950 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ స్మార్ట్ టీవీపై మీరు నేరుగా 63 శాతం తగ్గింపును పొందుతారు. యాడ్‌సన్ 80 సీఎం స్మార్ట్ టీవీ ధరపై మీరు 63 శాతం తగ్గింపు పొందుతున్నప్పటికీ మరి కొన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసినట్లయితే అదనంగా రూ.800 తగ్గిపు పొందుతారు. అంటే మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ స్మార్ట్ టీవీని కేవలం 7150 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాక మీరు కావాలనుకుంటే ఈ స్మార్ట్ టీవీని ఈఎమ్ఐ పద్ధతిలో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు 24 నెలల పాటు ప్రతి నెల రూ.386 చెల్లించాలి, లేదా 18 నెలల పాటు ప్రతి నెలా రూ.500 చెల్లించవచ్చు. కాదు, తక్కువ కాలంలోనే ఈఎంఐ పూర్తి చేసుకోవాలంటే 714 రూపాయల చొప్పున 12 నెలలు లేదా 936 రూపాయల చొప్పున 9 నెలలు చెల్లించవచ్చు. సత్వరంగా పూర్తి చేయాలంటే 6 నెలలకు ప్రతి నెలా రూ.1380 రూపాయలు కట్టవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మాత్రమే కాక బ్యాంక్ ఆఫ్ బరోడా, హెడ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్, హంగామా వంటి యాప్స్‌ని ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ టీవీలో సౌండ్ ఔట్‌ పుట్ 20 వాట్, రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్, వైడ్ వ్యూయింగ్ యాంగిల్, హై గ్రేడ్ డిస్‌ప్లే, కనెక్టివిటీ ఆప్షన్లలో సహా అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. 

No comments:

Post a Comment

Popular Posts