Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, August 17, 2023

వెస్పా కొత్త స్కూటర్ జస్టిన్‌ బీబర్‌ ఎక్స్‌ ఎడిషన్‌ ధర రూ. 6.45 లక్షలు !


టలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ పియాజియోకు చెందిన పియాజియో వెహికల్స్‌ కొత్త వెస్పా స్కూటర్‌ను గురువారం భారత్‌ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ.6.45 లక్షలుగా నిర్ణయించింది. జస్టిన్‌ బీబర్‌ ఎక్స్‌ ఎడిషన్‌  పేరుతో దీన్ని కంపెనీ లాంచ్‌ చేసింది. ఇదో లిమిటెడ్‌ ఎడిషన్‌ స్కూటర్‌ అని పియాజియో తెలిపింది. కెనడా పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేసినట్లు తెలిపింది. ఇందుకోసం జస్టిన్‌ బీబర్‌తో ఆ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రీ ఆర్డర్‌పై ఈ స్కూటర్లను దిగుమతి చేయనున్నట్లు పేర్కొంది. పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని విక్రయిస్తామని పియాజియో తెలిపింది. ఈ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 150 సీసీ ఇంజిన్‌ ఉంటుంది. యూరో 5 ఉద్గార ప్రమాణాలతో వస్తోంది. 8 లీటర్ల ఫ్యూయల్‌ కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్‌లో చెప్పుకోదగ్గ ఇతర ఫీచర్లేవీ లేవు. వెస్పా వెబ్‌సైట్‌ ద్వారా ప్రీ బుక్‌ చేసుకోవచ్చు. మరోవైపు దేశీయంగా ఆటోలతో పాటు ఏప్రిల్లా, వెస్పా స్కూటర్లను పియాజియో విక్రయిస్తోంది. వెస్పాలో క్లాసిక్‌, స్పోర్ట్స్‌, రేసింగ్‌ సిక్స్‌టీస్‌ పేరుతో వివిధ మోడళ్లు దేశీయంగా అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment

Popular Posts