Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, August 1, 2023

ఎస్ఎంఎస్ డెలివరీ రిపోర్టుతో మోసం !


సైబర్ నేరగాళ్లు ఎన్ని సెక్యూరిటీ చెక్ లను పెట్టుకుంటున్నాఏదో రకంగా దాడి చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకరకంగా మన వ్యక్తిగత డేటాను దొంగిలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసాన్ని పరిశోధకులు గుర్తించారు. అది కూడా మన సెల్ ఫోనే. మన సెల్ ఫోన్ లోని టెక్ట్స్ మెసేజ్ యాప్ ద్వారా ఫోన్ వినియోగదారుల లోకేషన్ ను ట్రాక్ చేస్తున్నారని కనుగొన్నారు.  ఫోన్ లోని టెక్స్ట్ మెసేజింగ్‌లో కొత్త తరహా మోసానికి అవకాశం ఉండే పరిస్థితిని పరిశోధకులు గుర్తించారు. ఇది వినియోగదారుల లోకేషన్లను కనుగొనడానికి హ్యాకర్‌లకు సాయం చేస్తుందని నిర్ధారించారు. యూఎస్-ఆధారిత ఈశాన్య విశ్వవిద్యాలయ పీహెచ్ డీ విద్యార్థి ఎవాంజెలోస్ బిట్సికాస్ నేతృత్వంలోని పరిశోధనా బృందం దీనిని కొనుగొంది. హ్యాకర్లు ఫోన్ లోని మెషిన్-లెర్నింగ్ ప్రోగ్రామ్, ఎస్ఎంఎస్ సిస్టమ్ నుండి డేటాను ఉపయోగించి వినియోగదారు లోకేషన్ ను ట్రాక్ చేస్తారని గుర్తించింది. వినియోగదారుడి ఫోన్ నంబర్, సాధారణ నెట్‌వర్క్ యాక్సెస్‌ను పొందడం ద్వారా, హ్యాకర్లు ఆ వినియోగదారుడు ప్రపంచంలో ఎక్కడున్న ట్రాక్ చేయగలుతారు. ఎస్ఎంస్ భద్రతలో కొన్ని అప్ డేట్లు వచ్చినప్పటికీ డెలివరీ నోటిఫికేషన్ల సమయం కారణంగా ఈ లోపం వస్తోందని పరిశోధకుల బృందానిని నేతృత్వం వహిస్తున్న బిడ్సికాస్ చెప్పారు. మనం ఎస్ ఎంఎస్ పంపినప్పుడు ఆటోమేటెడ్ డెలివరీ నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఫీచర్లే నేరగాళ్లు వాడుకుంటున్నట్లు గుర్తించినట్లు వివరించారు. వినియోగదారు మెసేజ్ స్వీకరించినప్పుడు, వారి ఫోన్ వారి స్థానాన్ని సూచించే టైమ్‌స్టాంప్‌తో స్వయంచాలకంగా డెలివరీ రసీదుని పంపుతుంది. ఈ ఫీచర్ మొదట్లో సమస్యాత్మకం కానప్పటికీ, బిట్సికాస్ చెబుతున్న దాని ప్రకారం, హ్యాకర్‌లు ఇప్పుడు మెషీన్ లెర్నింగ్‌ని ఉపయోగించి ఈ టైమ్‌స్టాంప్‌లను గుర్తించగల, వినియోగదారు లోకేషన్ గుర్తించగల ఒక అల్గారిథమ్‌ను రూపొందించారని వివరిస్తున్నారు. ఇందుకోసం వినియోగదారుడి ఫోన్ నంబర్ మాత్రం చాలని చెబుతున్నారు. ఎన్ని ఎక్కువ మెసేజ్ పంపితే అంత ఈజీగా మీ లోకేషన్ ను ట్రాక్ చేస్తారంటున్నారు.

ఎస్ఎంఎస్ ద్వారా లొకేషన్‌లను ట్రాక్ చేయడానికి మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించే హ్యాకర్‌ల కేసులు ఏవీ ఇప్పటి వరకూ ఒక్కటి కూడా బహిర్గతం కాలేదు. కానీ ఇలా కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని రక్షణ చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. సున్నితమైన కమ్యూనికేషన్‌ల కోసం సంప్రదాయ ఎస్ఎంఎస్ ను వినియోగించకండి. పటిష్టమైన భద్రతా ఫీచర్లను అందించే వాట్సాప్ వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించండి. మీకు తాజా భద్రతా ప్యాచ్‌లు,మెరుగుదలలు ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మీ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయండి. మీ ఫోన్ నంబర్‌ను పబ్లిక్‌గా, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయొద్దు. ఫోన్ సెట్టింగ్‌లను తనిఖీ చేయండి. వీలైతే ఎస్ఎంఎస్ కోసం రీడ్ రిసిప్ట్స్ నిలిపివేయండి. సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన.. తాజా బెదిరింపుల గురించి, ఆన్‌లైన్‌లో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి. అందుకోసం సైబర్ సెక్యూరిటీపై అవగాహన కలిగి ఉండాలి. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts