Ad Code

కర్వ్ డ్ డిస్ ప్లేతో లాంచ్ కాబోతున్న ఫోన్లు !


ప్రస్తుతం కర్వ్ డ్ డిస్ ప్లే ట్రెండ్ నడుస్తోంది. అందుకే కాబోలు మొబైల్ తయారీ కంపెనీలు అన్ని కూడా ఎగబడి మరి కర్వ్ డ్ డిస్ ప్లే తో వాటి కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే, ఈ రేసు ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ కోసం మాత్రం కాదండోయ్. ప్రీమియం సెగ్మెంట్ లో కర్వ్డ్ డిస్ప్లే ఫోన్లు చాలా కాలం ముందు నుండే అందుబాటులో ఉన్నాయి.

వివో వి29ఈ : వివో ఇండియాలో ఆగస్టు 28న విడుదల చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Curved Display తో లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ రేటు 25 నుండి 30 వేల మధ్య ఉండవచ్చు మరియు ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అతి సన్నని 3D Curved Display కలిగిన మొదటి ఫోన్ అవుందని కూడా కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే తో పాటు గొప్ప డిజైన్, కలర్ మరియు కెమేరా ఫీచర్లతో కనిపిస్తోంది.

ఐక్యూ జెడ్27 ప్రో : ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఆగస్టు 29 న విడుదల కాబోతోంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ Curved AMOLED Display మరియు Dimensity 700+ 5G ప్రోసెసర్ వంటి మరిన్ని ఫీచర్లతో ఆగష్టు 31వ తేదీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 25 కంటే తక్కువగా ఉండవచ్చని కంపెనీ ట్విట్టర్ అకౌంట్ నుండి అందించిన టీజర్ వీడియోలో ఒక హింట్ ఇచ్చింది.

ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ : బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న కంపనిగా పేరు పొందిన ఇన్ఫినిక్స్ కూడా బడ్జెట్ Curved Display రేసులో వుంది. Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ ను అతి సన్నని 3D Curved AMOLED డిస్ప్లే తో లాంచ్ చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ టీజింగ్ ద్వారా తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 30 వేల సబ్ కేటగిరిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో 4K వీడియోలను 60fps వద్ద షూట్ చెయ్యగల స్మూత్ కెమేరా ఉన్నట్లు కూడా కంపెనీ గొప్పగా చెబుతోంది.

Post a Comment

0 Comments

Close Menu