Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, August 12, 2023

అంటార్కిటికాలో వింత జీవి !


అంటార్కిటిక్‌ సముద్రంలో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. స్ట్రాబెర్రీ ఆకారంలో ఉన్న దాని దేహం చుట్టూ చేతుల్లాగా 20 శాఖలు ఉన్నాయి. ఇటీవల సముద్ర జీవుల పరిశోధన కోసం ఓడలో వెళ్లిన శాస్త్రవేత్తలు ఈ విశిష్ట ఆకారంలో ఉన్న జీవిని గుర్తించారు. ఈ వింత జీవికి శాస్త్రీయంగా 'ప్రోమాకోక్రినస్‌ ఫ్రగారియస్‌' అని నామకరణం చేశారు. అదేవిధంగా 'అంటార్కిటిక్‌ స్ట్రాబెర్రీ ఫెదర్‌ స్టార్‌' అనే సాధారణ పేరును కూడా విలక్షణ జీవికి పెట్టారు. ఇరవై శాఖలతో స్ట్రాబెర్రీ ఆకారంలో దేహాన్ని కలిగి ఉన్నందున దానికి ఆ పేరు పెట్టినట్టు తెలిపారు. ఇలాంటి వింత జీవులు అంటార్కిటిక్‌ సముద్రంలో 65 అడుగుల నుంచి 6,500 అడుగుల లోతులో ఉంటాయని పేర్కొన్నారు. తాజా వింత జీవికిగల 20 చేతుల్లో రెండు రకాలు ఉన్నాయని, లోపలి వైపు ఉన్న శాఖలు రఫ్‌గా, బలంగా బయటి వైపు శాఖలు సన్నగా, ఈకల్లాగా ఉన్నాయని సైంటిస్టులు వెల్లడించారు.

No comments:

Post a Comment

Popular Posts