Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, August 31, 2023

ఆదిత్య L1 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ !

                                ఆదిత్య-L1
చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత 'ఆదిత్య హృదయాన్ని' ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి  శ్రీహరికోట వేదికగా రంగం సిద్ధమైంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. ఆదిత్య L1 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన పరికరాలన్నీ శ్రీహరికోట-షార్‌ కేంద్రానికి చేరుకున్నాయి. విశ్వ రహస్యాల గుట్టువిప్పడానికి సంకల్పం చేసిన ఇస్రో..కీలక ప్రయోగాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్‌ త్రీ సక్సెస్‌తో..
 
 అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడిన ఇస్రో..తాజాగా ఆదిత్య-L1 ప్రయోగానికి సిద్ధమైంది. ఆదిత్య ఎల్-1- సూర్యుని పై పరిశోధనలకు ఇస్రో చేస్తున్న తొలి ప్రయత్నం..! ఇప్పటిదాకా చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేసిన ఇస్రో.. అద్భుత రహస్యాలను బయటపెట్టింది. అదేవిధంగా సూర్యుడి రహస్యాలను కనిపెట్టడమే లక్ష్యంగా ఇస్రో ఆదిత్య-L1 ప్రయోగం చేపడుతోంది. సెప్టెంబర్ 02 న PSLV C-57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం జరగనుంది. సూర్యుని అయస్కాంత క్షేత్రంలో సంభవించే మార్పులు.. కరోనియంలో ఉన్న పదార్థాలు.. సూర్యునిలో నిత్యం జరిగే డైనమిక్ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి భారత్ చేస్తున్న తొలి ప్రయోగం ఇది..! తరచూ మనం చూస్తున్న సౌర తుఫాన్ కారణంగా అంతరిక్షంలో ఉపగ్రహాలపై పడుతున్న ప్రభావంతో.. సమాచార వ్యవస్థ పై అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఫోటో స్పియర్, క్రోమోస్పియర్ లపై పరిశోధనలు చేసి భూమిపై సూర్యుని వల్ల కలిగే దుష్పరిణామాలకు కారణాలు, పరిష్కారాలు చూపేందుకు అవకాశాలు తెలిసే అవకాశం ఉందంటోంది.  సెప్టెంబరు 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య L1 ప్రయోగం జరుగుతుంది.

No comments:

Post a Comment

Popular Posts