దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, అల్కాజార్ కార్ల అడ్వెంచర్ ఎడిషన్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు కార్లూ చాలా ఆకర్షణీయమైన పెయింట్ ఆప్షన్లతో ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ కూడా అదిరిపోయింది. అడ్వెంచర్ ఎడిషన్లలో ప్రవేశపెట్టిన రెండు కార్లూ ఆకట్టుకుంటున్నాయి. ఖాకీ కలర్‌లో లాంచ్ అయ్యింది. ఇది గ్రిల్, స్కిడ్ ప్లేట్లు, సైడ్ సిల్స్, రూఫ్ రైల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ORVMలు, అలాయ్ వీల్స్‌తో సహా బ్లాక్-అవుట్ కలర్ ఎలిమెంట్స్‌ను కలిగివుంది. క్రెటా, అల్కాజార్ బ్రాండింగ్ కోసం డార్క్ క్రోమ్ ఫినిషింగ్ ఉపయోగించారు. అడ్వెంచర్ లోగో ఫ్రంట్ ఫెండర్‌లో ఇచ్చారు. లోపలి భాగంలో, హ్యుందాయ్ నుంచి వచ్చిన కొత్త అడ్వెంచర్ ఎడిషన్ మోడల్ ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్, సేజ్ గ్రీన్ ఇన్సర్ట్‌లు, కొత్త సీట్ అప్హోల్స్టరీ, డ్యుయల్ కెమెరాలతో కూడిన డాష్‌క్యామ్, అడ్వెంచర్-స్పెక్ మ్యాట్‌లు, మెటల్ పెడల్స్‌ను కలిగివుంది. క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, రేంజర్ ఖాకీ మోనోటోన్ పెయింట్ స్కీమ్‌లతో సహా ఆరు రంగులలో అందుబాటులో ఉంది. డ్యూయల్-టోన్ వాటిలో అట్లాస్ వైట్, రేంజర్ ఖాకీ కలర్‌వి ఉన్నాయి. రెండూ అబిస్ బ్లాక్ రూఫ్‌తో ఉన్నాయి. అల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్ నాలుగు మోనోటోన్ రంగులలో లభిస్తోంది. అవి అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, రేంజర్ ఖాకీ. మూడు డ్యూయల్-టోన్ రంగులు - అట్లాస్ వైట్, రేంజర్ ఖాకీ, టైటాన్ గ్రేతో ఉన్నాయి. అన్నీ అబిస్ బ్లాక్ రూఫ్‌తో ఉన్నాయి. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ పవర్‌తో శక్తిని పొందుతుంది. సిగ్నేచర్‌లో ఆరు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్, ఏడు-స్పీడ్ DCT యూనిట్‌తో జత అయి ఉన్నాయి. ప్లాటినం ట్రిమ్‌లు జోడించారు. క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ 1.5-లీటర్, నేచురల్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగివుంది. ఇది SX ట్రిమ్‌లో ఆరు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, SX(O) ట్రిమ్‌లో IVT గేర్‌బాక్స్‌ను కలిగివుంది. అల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.15.17 లక్షలు ఉండగా... క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.19.04 లక్షలు ఉంది.
0 Comments