Ad Code

22న టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్‌ విడుదల !


టెక్నోమొట్టమొదటి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. సెప్టెంబర్ 22న సింగపూర్‌లో ఫ్లిప్ ఇన్ స్టైల్ టెక్నో ఫ్లాగ్‌షిప్ ప్రోడక్ట్ లాంచ్ 2023 ఈవెంట్‌ జరుగనుంది.14-అంగుళాల ల్యాప్‌టాప్ అనే మరో ప్రొడక్టుతో పాటుగా ప్రవేశపెట్టనుందని కంపెనీ ధృవీకరించింది. లీక్ అయిన ఇమేజ్‌లు, సమాచారం విషయానికి వస్తే.. Tecno Phantom V ఫ్లిప్ బయటి కవర్‌లో సర్కిల్ డిస్‌ప్లే కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సెకండరీ స్క్రీన్ చుట్టూ.. రెండు వెనుక కెమెరాలు, LED ఫ్లాష్‌ను గుర్తించవచ్చు. మీరు దాన్ని ఫ్లిప్ చేసి ఓపెన్ చేస్తే.. ముందు భాగంలో సెన్సార్‌తో హోల్-పంచ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్ మోడల్ నంబర్ AD11తో Google Play కన్సోల్ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. ఈ జాబితా ప్రకారం.. 8GB RAMని కలిగి ఉండవచ్చు. బాక్స్ వెలుపల Android 13తో రావచ్చు. హుడ్ కింద, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్‌తో రన్ కావొచ్చు. ARM Mali G77 GPUతో కలిసి ఉండవచ్చు. 1,080×2,640 పిక్సెల్‌ల రిజల్యూషన్ 480ppi పిక్సెల్ సాంద్రతతో ఫుల్-HD+ డిస్‌ప్లేను పొందవచ్చు. కెమెరా వారీగా వెనుకవైపు 64MP ప్రధాన కెమెరాతో పాటు 13MP సెకండరీ కెమెరా, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. 4,000mAh బ్యాటరీ కావచ్చు. 45W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu