ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రత్యేక సేల్ అక్టోబర్ 08 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేక సేల్ జరగనున్నట్లు వెల్లడించింది.ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54, పిక్సెల్ 7ఏ, పోకో ఎక్స్5 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, రెడ్‌మీ నోట్ 12 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఏ34, పోకో ఎఫ్5, శాంసంగ్ గెలాక్సీ ఏ23, ఒప్పో రెనో 10, మోటోరోలా ఎడ్జ్ 40, మోటోరోలా జీ54, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై గణనీయ తగ్గింపు ఉండనున్నట్లు వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. మోటోపై సెప్టెంబర్ 28న, వివోపై 29న, ఇన్ఫీనిక్స్‌పై 30న, రియల్‌మీపై అక్టోబర్ 02న, శాంసంగ్‌పై 3న, పోకోపై 4న, గూగుల్ పిక్సెల్‌పై అక్టోబర్ 05న, రెడ్‌మీ ఫోన్లపై అక్టోబర్ 05న ఆఫర్లను ప్రకటించనున్నట్లు తెలిపింది. బిగ్ బిలియన్ సేల్ లో భాగంగా వివో టీ2 ప్రో 5జీ, మోటోరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ, పిక్సెల్ 8 సిరీస్, వివో వీ29 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్లు విడుదల కానున్నాయి. వీటితో పాటు ఇటీవలే విడుదలై మోటో జీ54 5జీ, రియల్‌మీ సీ51, గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్లపై రాయితీ లభించనుంది. ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13, గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌పై 50-80% వరకు ఆఫర్ ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పాదరక్షలు, సంప్రదాయ దుస్తులు, ఆభరణాల వంటి ఫ్యాషన్ ఉత్పత్తులపై 90 శాతం వరకు ఆఫర్లు ఉన్నట్లు వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. బ్యూటీ ప్రోడక్ట్స్‌పైన 60- 80శాతం వరకు రాయితీ లభించనున్నట్లు పేర్కొంది. హోమ్‌డెకర్ విభాగంలో 80 శాతం, ఫర్నీచర్‌పై 85శాతం వరకు తగ్గింపు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
అక్టోబర్ 8 నుంచి 15 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ !
0
September 28, 2023
Tags