టాటా ఆల్ట్రోజ్ : టాటా ఆల్ట్రోజ్ (డీసీఏ) కారుపై రూ.15,000 కన్స్యూమర్ స్కీమ్‌తో పాటు రూ.10,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మొత్తంగా రూ. 25,000 డిస్కౌంట్‌తో ఈ కారును సొంతం చేసుకోవచ్చు. టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్‌పై కూడా రూ. 15,000 కన్స్యూమర్ స్కీమ్‌తో పాటు రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. దీంతో మొత్తం రూ. 25,000 తగ్గింపుతో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.
టాటా సఫారీ : టాటా మోటార్స్ సఫారి MT వేరియంట్ రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ మోడల్ మరో రెండు వెర్షన్స్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. సఫారి AT(NON - ADAS) వెర్షన్‌పై రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్, సఫారి AT(ADAS) వేరియంట్‌పై రూ. 50,000 ప్లస్ కన్స్యూమర్ స్కీమ్‌తో పాటు రూ.25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. మొత్తం రూ. 75,000 డిస్కౌంట్‌తో ఈ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు.
టాటా టియాగో : టాటా మోటార్స్, టియాగో CNG (సింగిల్ సిలిండర్) కారుపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దీనిపై రూ.30,000 కన్స్యూమర్ స్కీమ్‌తో పాటు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో కస్టమర్లు మొత్తం రూ.50,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇక టియాగో సీఎన్‌జీ (ట్విన్ సిలిండర్)పై కూడా ఆఫర్ ఉంది. దీన్ని రూ. 20,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌లో కొనుగోలు చేయవచ్చు.
టాటా టిగోర్ : టిగోర్ సీఎన్‌జీ (సింగిల్ సిలిండర్) వేరియంట్‌పై టాటా మోటార్స్ రూ.30,000 కన్స్యూమర్ స్కీమ్‌తో పాటు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది. అంటే ఈ కారుపై మొత్తం రూ. 50,000 డిస్కౌంట్ లభిస్తుంది. టిగోర్ సీఎన్‌జీ (ట్విన్ సిలిండర్) వేరియంట్‌పై కూడా కంపెనీ ఆఫర్ ప్రకటించింది. రూ.20,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌తో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
టాటా హారియర్ : టాటా మోటార్స్ హారియర్ MT వేరియంట్‌పై కంపెనీ రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ మోడల్‌కు చెందిన మరో రెండు వెర్షన్స్‌పై కూడా ఆఫర్స్ ఉన్నాయి. హారియర్ AT(NON - ADAS) వేరియంట్‌పై రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. ఇక హారియర్ AT(ADAS)పై రూ.50,000 కన్స్యూమర్ స్కీమ్‌తో పాటు రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో మొత్తం రూ.75,000 డిస్కౌంట్ పొందవచ్చు.
టాటా నెక్సాన్ (ప్రీ-ఫేస్‌లిఫ్ట్) : నెక్సాన్ ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌పై సైతం మంచి ఆఫర్లు ఉన్నాయి. అయితే ఇది డీలర్ వద్ద ఉన్న పాత స్టాక్ లభ్యతకు లోబడి ఉంటుంది. కాగా, టాటా మోటార్స్ కొత్త కారు కొనుగోలుపై రూ. 10,000 వరకు కార్పొరేట్ బోనస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.