Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, September 10, 2023

ఖరీదైన బైక్‌పై జొమాటో ఫుడ్ డెలివరీ !


జొమాటో నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటుంది. జొమాటోలో పనిచేసే ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్ రూ.10 లక్షల బైక్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పాజిటివ్ లేదా నెగటివ్ సందర్భాల్లో వార్తల్లోకి వస్తుంటారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటారు. ఇదేమి కొత్త కాదు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్‌గా మారుతోంది. అతను ఏకంగా రూ.10 లక్షల విలువైన బైక్‌పై ఫుడ్ డెలివరీ చేస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోలో సదరు వ్యక్తిని మీరు బతకడానికి ఏం చేస్తుంటారు? అని మరో వ్యక్తి అడిగితే అతను సమాధానం చెప్పిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. తాను జొమాటోలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నానని, డుకాటి బైక్‌పై కూర్చున్న వ్యక్తి దర్జాగా చెప్పాడు. అంతే కాదు, జొమాటో నుంచి తాను ఎలా సంపాదిస్తున్నానో కూడా వివరించాడు. జొమాటో తనకు ఒక్కో డెలివరీకి రూ.200 చెల్లిస్తుందని, రూ.50 పెట్రోల్‌కు ఖర్చయిపోయినా, ఒక్కో ఆర్డర్‌పై రూ.150 మిగుల్తుందని చెప్పాడు. రోజూ 20 వరకు ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ.45,000 వరకు సంపాదిస్తానని వీడియోలో సదరు వ్యక్తి వివరించాడు. 

No comments:

Post a Comment

Popular Posts