టెలిగ్రామ్ మరికొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఈ లిస్ట్‌లో ఛానెల్స్ స్టోరీస్, రియాక్షన్ స్టిక్కర్లు, స్టోరీస్‌లో మ్యూజిక్, వ్యూ వన్స్ మీడియా, కొత్త లాగిన్ అలర్ట్స్ ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్స్ మరికొద్ది రోజుల్లో యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నాయి. యూజర్లు ఎక్కువ మంది ఫాలోవర్లకు మెసేజ్‌లు పంపడానికి వీలుగా ఛానెల్స్ పేరుతో ఇటీవల కొత్త ఫీచర్‌ను టెలిగ్రామ్ పరిచయం చేసింది. ఇప్పుడు, ఛానెల్స్‌లో స్టోరీస్ కూడా పోస్ట్ చేసుకునే సదుపాయాన్ని అందించింది. స్టోరీస్ 24 గంటల తర్వాత అదృశ్యమయ్యే చిన్న వీడియోలు లేదా ఫొటోలు. స్టోరీస్ పోస్ట్ చేయడానికి, ఛానెల్‌కు కనీసం ఒక బూస్ట్ ఉండాలి. బూస్ట్ అనేది సబ్‌స్క్రైబర్లు అందించే స్పెషల్ టోకెన్. టెలిగ్రామ్ ప్రీమియం ఉన్న సబ్‌స్క్రైబర్లు నచ్చిన ఛానెల్‌కి నెలకు ఒక బూస్ట్ ఇవ్వగలరు. ఛానెల్ ఎంత ఎక్కువ బూస్ట్‌లను కలిగి ఉంటే, అది రోజుకు అంత ఎక్కువ స్టోరీస్ పోస్ట్ చేయగలదు. ఛానెల్ కోసం బూస్ట్ లింక్‌ని పొందడానికి, ఛానెల్ ఇన్ఫో> మోర్ > స్టాటిస్టిక్స్ > బూస్ట్స్‌కు వెళ్లాలి. యూజర్లు, ఛానెల్ క్రియేటర్లు ఎమోషన్స్ లేదా అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి స్టోరీస్‌కు స్టిక్కర్లను యాడ్ చేసుకోవచ్చు. స్టోరీస్‌కు స్టిక్కర్‌ని జోడించడానికి, స్టిక్కర్ ప్యానెల్‌లోని క్లౌడ్ ఐకాన్‌పై నొక్కి, ఎమోజీని ఎంచుకోవాలి. ప్రీమియం సబ్‌స్క్రైబర్లు వారి సొంత కస్టమ్ ఎమోజీలను కూడా ఉపయోగించవచ్చు. ఛానెల్స్ పోస్ట్ చేసిన స్టోరీస్ రియాక్షన్ కౌంటర్లను ప్రదర్శిస్తాయి, ప్రతి ఎమోజీని ఎంత మంది ఫాల్లోవర్లు సెలెక్ట్ చేసుకున్నారో చూడవచ్చు. ప్రతి యూజర్ ఒక్కో స్టోరీకి 1 రియాక్షన్ స్టిక్కర్‌ని జోడించవచ్చు, ప్రీమియం యూజర్లు 5 వరకు యాడ్ చేసుకోవచ్చు. యూజర్లు ఈ కొత్త ఫీచర్‌తో రిసీవర్ ఒకసారి వ్యూ చేశాక అదృశ్యమయ్యేలా మీడియా ఫైల్స్‌ను పంపవచ్చు. రిసీవర్ డివైజ్‌లో లేదా చాట్ హిస్టరీలో ఉంచకూడదనుకునే సున్నితమైన లేదా పర్సనల్ వీడియో/ఫొటో పంపడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. వ్యూ వన్స్ మీడియాను పంపడానికి, మీడియా ఎడిటర్‌లోని టైమర్ ఐకాన్‌పై నొక్కాలి, ఇక్కడ 3 సెకన్స్, 30 సెకన్స్ వంటి టైం పీరియడ్స్ తో పాటు వ్యూ వన్స్ (View-Once) కనిపిస్తుంది. వ్యూ వన్స్‌పై క్లిక్ చేసే మీడియా ఫైల్ పంపిస్తే రిసీవర్ ఒకసారి మాత్రమే దానిని చూడగలరు. స్క్రీన్‌షాట్ తీసుకోలేరు. వేరొక డివైజ్ లేదా లొకేషన్ నుంచి ఎవరైనా అకౌంట్‌కు లాగిన్ అయినప్పుడు టెలిగ్రామ్ యూజర్ డివైజ్‌లన్నిటికీ నోటిఫికేషన్ పంపిస్తుంది. అనధికారిక యాక్సెస్ లేదా హ్యాకింగ్ ప్రయత్నాల నుంచి వినియోగదారులు ఖాతాను రక్షించుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. గుర్తించని లాగిన్ అలర్ట్ చాట్ టాప్ ప్లేస్ లో కనిపిస్తుంది, ఆ అలర్ట్ కింద "ఎస్, ఇట్స్ మీ", "నో, ఇట్స్ నాట్ మీ" ఆప్షన్స్ కనిపిస్తాయి. తెలియని లాగిన్ అలర్ట్ అయితే "నో ఇట్స్ నాట్ మీ" ఆప్షన్‌పై క్లిక్ చేసి అకౌంట్‌ను సెక్యూర్ చేసుకోవచ్చు. యూజర్లు ఇప్పుడు స్టోరీస్‌లో ఆడియో ట్రాక్‌లు, వాయిస్ ఓవర్స్ లేదా సౌండ్ ఎఫెక్ట్‌లు యాడ్ చేసుకోవచ్చు. స్టోరీస్‌కు ఆడియోను యాడ్ చేయడానికి, మీడియా ఎడిటర్‌లోని మ్యూజిక్ నోట్ ఐకాన్‌పై నొక్కాలి. డివైజ్ నుంచి లేదా టెలిగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీ నుంచి ఆడియో ఫైల్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
0 Comments