Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, September 11, 2023

టెక్నో నుంచి ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ?


మన దేశంలో అత్యంత చౌకైన ఫోల్డ్ ఫోన్ టెక్నో లాంచ్ చేసిన టెక్నో ఫాంటం వీ ఫోల్డ్. దీని ధర రూ.88,888గా ఉంది. అమెజాన్లో దీనిపై 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇతర కంపెనీలతో పోల్చితే కంపెనీ టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ ను అతి తక్కువ ధరకు టెక్నో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ త్వరలో ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేయనుంది. కంపెనీ సెప్టెంబరు 22వ తేదీన సింగపూర్లో జరగనున్న ఫ్లిప్ ఇన్ స్టైల్ టెక్నో ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ లాంచ్ 2023 ఈవెంట్లో టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ ను లాంచ్ చేయనుంది. లాంచ్ కు ముందు ఈ మొబైల్ ఫోన్ కు సంబంధించిన కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించే ముందు, దాని మొబైల్ కవర్ ఒక చైనీస్ షాపింగ్ వెబ్ సైట్లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. లీక్ ల ప్రకారం చూస్తే టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ లో సర్క్యులర్ కవర్ డిస్ ప్లే అందించారు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్లో రెండు కెమెరాలు ఉండనున్నాయి. ముందు భాగంలో పంచ్ హోల్ డిస్ ప్లే అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం 8 జీబీ ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్ను ఫోన్లో కనుగొనవచ్చు. టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్లో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను చూడవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేయనున్న 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. దీని ధర దాదాపు రూ.50,000 ఉండవచ్చు. శాంసంగ్ ఫ్లిప్ 4 ధర రూ.90 వేల వరకు ఉంది. దీన్ని బట్టి టెక్నో ఫోన్ ధర చాలా తక్కువ అని చెప్పవచ్చు.

No comments:

Post a Comment

Popular Posts