లావా ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో తీసుకు వచ్చిన లావా బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భారీ బ్యాంక్ ఆఫర్ తో చౌక ధరలో లభిస్తోంది. లావా బ్లేజ్ 5జి స్మార్ట్ ఫోన్ రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. అయితే, ఈ ఫోన్ పైన అందించిన SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 9,000 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, ఈ లావా 5జి స్మార్ట్ ఫోన్ పైన ఎక్స్ ఛేంజ్ బోనస్ ను కూడా అమేజాన్ ఆఫర్ చేస్తోంది. 6.5 ఇంచ్ HD+ 90Hz IPS డిస్ప్లేని HD కంటెంట్ ను చూడటానికి వీలుగా Widevine L1 సర్టిఫికేషన్ తో కలిగి వుంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ MediaTek Dim, ensity 700 ప్రోసెసర్ తో వస్తుంది మరియు జతగా 4GB RAM + UFS 2.2 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో లావా అందించిన 3 GB Virtual RAM ఫీచర్ తో ఇది 7GB పని తనాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ లో 50MP AI ట్రిపుల్ రియర్ కెమేరా EIS సప్పర్ట్ తో కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ 2K Video లను అందించ గలదు. ఈ 5జి స్మార్ట్ ఫోన్ Clean Android 12 తో వస్తుంది 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. సింపుల్ గా చెప్పాలంటే, 10 వేల రూపాయల బడ్జెట్ లో 5G Smartphone కోరుకునేవారు ఈ లావా బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను పరిగణలోకి తీసుకోవచ్చు.