Ad Code

వాట్సాప్ లో స్విచ్ అకౌంట్స్ ఫీచర్‌ !


మొబైల్ ఫోన్లు అన్నీ డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. దాంతో చాలామంది రెండేసి మొబైల్ నెంబర్లను వాడుతున్నారు. పర్సనల్ అవసరాలకు ఒక నెంబర్, ప్రొఫెషనల్ వర్క్ కోసం మరో నెంబర్ వాడుతుంటారు. అయితే రెండు నెంబర్లు వాడుతున్నప్పటికీ వాట్సాప్ మాత్రం కేవలం ఒకే నెంబర్‌తో వాడుకోవాల్సి వస్తుంది. రెండో నెంబర్‌పై వాట్సాప్ వాడాలంటే డూప్లికేట్ యాప్ వాడాల్సి వచ్చేది. లేదా ఒక అకౌంట్ లాగవుట్ చేసి మరో అకౌంట్‌తో లాగిన్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాట్సాప్ స్విచ్ అకౌంట్స్ ఫీచర్‌ను తీసుకురానుంది. అంటే ఒకే వాట్సాప్ యాప్‌ను రెండు నెంబర్లతో వాడుకోవచ్చు. అకౌంట్‌ను లాగవుట్ చేసే పనిలేకుండా ఒకేసారి రెండు అకౌంట్లను ఆన్‌లో ఉంచుకోవచ్చు. గత కొన్ని రోజులుగా టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. "త్వరలోనే మీరు ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను వాడుకోవచ్చు. ప్రతిసారీ లాగవుట్ చేయడం లేదా రెండు ఫోన్‌లను తీసుకెళ్లడం గురించి ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే వాట్సాప్ డ్యుయల్ అకౌంట్స్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది" అని జుకర్ బర్గ్ ప్రకటించారు. వాట్సాప్ లో రెండు అకౌంట్స్ క్రియేట్ చేసేందుకు వాట్సాప్‌ ఓపెన్‌ చేసి టాప్ రైట్ కార్నర్‌లో ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి. అక్కడ 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ 'యాడ్‌ అకౌంట్‌'పై క్లిక్‌ చేసి ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవ్వడం ద్వారా రెండో అకౌంట్‌ను యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత టాప్ రైట్ కార్నర్‌లోని మెనూలో రెండు అకౌంట్ల మధ్య స్విచ్ అయ్యే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కావల్సినప్పుడల్లా అకౌంట్స్‌ను మార్చుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu