Ad Code

సిమ్ కార్డు పై కొత్త రూల్స్ !


ఇకనుంచి సిమ్ కార్డులు విక్రయంలో పలు నియమాలను పాటించాల్సి ఉంటుందని ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే 10 లక్షల రూపాయల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అయితే సిమ్ కార్డ్ మోసాల రేటును అరికట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతోందని సమాచారం. నకిలీ సిమ్ కార్డుల విక్రయాలను నిరోధించేందుకే సేల్ చేసే వారి దగ్గర నుంచి ఈ నిబంధన తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇది కొనుగోలు దారుల పైన ఎలాంటి ప్రభావం చూపుతోందో చూడాలి..చాలాకాలంగా వస్తున్న ఫిర్యాదులకు కూడా ఇది కాస్త ఉపశమనం లభించేలా కనిపిస్తోంది.. దేశంలో రోజురోజుకీ ఫ్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు సైతం చాలానే అమ్ముడుపోతున్నాయి.. చాలా సందర్భాలలో సైతం కొన్ని సిమ్ములు ఇతర పేర్లు మీద రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కొత్త నిబంధనను అమలులోకి వచ్చిన తర్వాత వినియోగించిన తర్వాత ముందుగా యాక్టివ్ చేసుకున్న సిమ్ములను ఇతరులకు బదిలీ చేయలేరు. దీంతో సిమ్ కార్డులు విక్రయిస్తున్న వారందరి పైన నిగా పెట్టి వినియోగదారుల సమస్యను సైతం ముగింపు పలికేందుకే టెలి కమ్యూనికేషన్ విభాగం ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ కొత్త నిబంధనల ప్రకారం ప్రతి సిమ్ కార్డు దుకాణానికి సైతం కార్పొరేట్ ఐడి లేదా ఏదైనా నెంబర్ జారీ చేయబడుతుందట.. అయితే ఈ నెంబర్ ని ఎంట్రి చేయకుండా ఎవరికి సిమ్ కార్డు ని అమ్మలేరట.. ఇప్పుడు ఒక రిటైల్ స్టోర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ కింద నమోదు చేయడానికి కచ్చితంగా ఆధార్ కార్డు ,పాన్ కార్డు, జిఎస్టి వివరాలను సైతం అందించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా ఏ దుకాణదారుడు సిమ్ కార్డును అమ్మేందుకు వీలు లేదు. అలా చేస్తే ఆ దుకాణం ఐడి బ్లాక్ చేయబడుతుందట. అలాగే జరిమానా కూడా విధించబడుతుందట.. ఎవరైనా వ్యక్తి సిమ్ కార్డు పోగొట్టుకున్నట్లు అయితే లేదా సిమ్ కట్ చేసిన అతని వెరిఫికేషన్ ను పూర్తి చేయవలసి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu