అర్బన్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్‌లు విడుదల !
Your Responsive Ads code (Google Ads)

అర్బన్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్‌లు విడుదల !

ర్బన్ రెండు కొత్త స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేసింది. అర్బన్ వేవ్ త్రీ, అర్బన్ నోవా పేరిట వాటిని ఆవిష్కరించింది. అర్బన్ వేవ్ త్రీ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,499కాగా.. అర్బన్ నోవా కంపెనీ ధర రూ. 1,799గా ఉంది. అర్బన్ వేవ్ త్రీ స్మార్ట్ వాచ్.. ఈ స్మార్ట్ వాచ్ లో 1.91 అంగుళాల ఐపీఎస్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. మూడు ఇంటర్ చేంజబుల్ స్ట్రాప్స్, బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్, ఏఐ వాయిస్ సపోర్టు ఉంటుంది. హెల్త్ మోనిటరింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. ఇతర అంశాలను పరిశీలిస్తే అర్బన్ వేవ్ త్రీ స్మార్ట్ ఫోన్ స్ల్పిట్ స్క్రీన్ ఫంక్షన్ తో వస్తుంది. వినియోగదారులు వాతావరణాన్ని తనిఖీ చేయడానికి, సందేశాలకు ప్రతిస్పందించడానికి లేదా వివిధ హెల్త్ ట్రాకర్లతో పాటు స్పోర్ట్స్ మోడ్లు అందుబాటులో ఉంటాయి. అర్బన్ నోవా స్మార్ట్ వాచ్.. ఈ స్మార్ట్ వాచ్ 1.86 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే తోవస్తుంది. ట్రెండీ స్ట్రాప్, బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్, ఏఐ వాయిస్ అసిస్టెంట్, విభిన్న రకాల వాచ్ ఫేసేస్ వంటి అనేకరకాల పీచర్లు ఉంటాయి. ఇది తొమ్మిది రకాల కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అలాగే హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే హార్ట్ రేట్ మోనిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మోనిటరింగ్ ఉంటుంది. రోజూవారీ వివిధ దశలను ట్రాక్ చేస్తుంది. ఇది రోటేటింగ్ క్రౌన్ తో వస్తుంది. ఈ సందర్భంగా అర్బన్ కో ఫౌండర్ ఆశిష్ కాంబాత్ మాట్లాడుతూ తమ కొత్త ఉత్పత్తులైన అర్బన్ వేవ్ త్రీ, అర్బన్ నోవా స్మార్ట్ వాచ్ లు మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చేందుకు సరిగ్గా సరిపోతాయన్నారు. ఈ రెండు స్మార్ట్ వాచ్ లు ప్రస్తుత ఫ్యాషన్ తో పాటు లైఫ్ స్టైల్ అండ్ టెక్నాలజీకి సరిగ్గా సరిపోతాయన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog