అమెజాన్ బేసిక్స్ కంపెనీకి చెందిన ఈ వైర్‌లెస్ మౌస్‌ను రీఛార్జబుల్‌గా రూపొందించారు. బ్యాటరీ సెల్స్ అవసరం లేకుండా ఫోన్ ఛార్జర్‌తో ఈ మౌస్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ మౌస్ అసలు ధర రూ. 2,300కాగా అమెజాన్ సేల్‌లో భాగంగా ఏకంగా 81 శాతం డిస్కౌంట్‌తో రూ. 449కే సొంతం చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌తో పాటు పర్సనల్ కంప్యూటర్‌కు ఈ మౌస్‌ను కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. హెచ్‌పీ కంపెనీకి చెందిన HP M120 వైర్‌లెస్ మౌస్ అసలు ధర రూ. 999కాగా 57 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 429కి సొంతం చేసుకోవచ్చు. 3డీ స్క్రోల్ వీల్, డీపీఐ స్విఛ్ బటన్ వంటి ఫీచర్స్ ఇందులో అందించార. ఈ మౌస్‌తో పాటు 3 ఏళ్ల వారంటీని కంపెనీ అందిస్తోంది. Portronics Toad III వైర్‌లెస్ మౌస్‌లో 2.4 జీహెచ్‌జెడ్ డ్యూయల్ కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. రీఛార్జబుల్ మౌస్ అసలు ధర రూ. 999కాగా 50 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. 10 మీటర్ల రేంజ్ వరకు ఈ మౌస్ వైర్ లేకుండా పని చేస్తుంది. ZEBRONICS Zeb-Jaguar Wireless Mouse రూ. 500లో లభిస్తున్న మరో బెస్ట్ బ్రాండెడ్ మౌస్‌లలో జిబ్రోనిక్ కంపెనీకి చెందిన ఈ మౌస్ ఒకటి. ఈ మౌస్ అసలు ధర రూ. 1,920కాగా, 79 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 398కే సొంతం చేసుకోవచ్చు. వైర్‌లెస్ యూఎస్‌బీ టెక్నాలజీతో పనిచేసే ఈ మౌస్‌లో యూఎస్‌బీ నానో రిసీవర్ ఫీచర్‌ను అందించారు. Logitech B170 Wireless Mouse రూ. వెయ్యిలోపు లభిస్తున్న మరో బెస్ట్ మౌస్‌లలో ఇదీ ఒకటి.. ఈ మౌస్ అసలు ధర రూ. 895కాగా 44 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. అప్టికల్ ట్రాకింగ్ వంటి ఫీచర్‌ను అందించారు. ఈ మౌస్ 12 నెలల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
వైర్‌లెస్ మౌస్‌లపై అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్స్ !
0
October 31, 2023
Tags