Ad Code

కొత్త లుక్ తో యమహా RX100 !


1985లో యమహా RX100ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. వచ్చి రావడంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ వాహనం. 2 స్ట్రోక్ ఇంజిన్ తో మార్కెట్ లోకి వచ్చి ఓ ఊపు ఊపేసింది. కుర్రకారు ఎగబడి మరీ బైక్ కొనేశారు. ఈ బైక్ సౌండ్ వింటే ఆ కిక్కే వేరప్పా అనే భావన అప్పట్లో ఉండేది. ముఖ్యంగా యువతులను ఆకర్షించడానికి యువకులు ఎక్కువగా RX100 బైక్స్ వాడేవారు. కొన్ని భారతీయ సినిమాల్లో కూడా ఆర్ఎక్స్100 బైక్స్‌ని హీరోలు ఉపయోగించడం చూశాం. అయితే ఈ బైక్‌ని 1996 తర్వాత నిలిపివేశారు. అప్పటితో ప్రోడక్ట్ ఆపేయడంతో క్రమంగా కనుమరుగైన ఈ బైక్.. ఇప్పటికీ ఎక్కడో చోట రయ్ రయ్ అంటూ దూసుకుపోతుండటం చూస్తున్నాం. అయితే నేటికీ RX100 అంటే ఎంతో మోజు పడుతున్న కుర్రకారు కోసం ఈ సారి సరికొత్తగా కంపెనీ వారు ఈ బైక్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. Rx 100 బైకు మళ్లీ భారత రోడ్లపై రయ్యిమంటూ దూసుకెళ్లేందుకు ముస్తాబవుతోంది. ఈ సారి కొత్త జనరేషన్ కోరుకునేలా కొత్త రూపుతో యమ క్రేజీగా లాంచ్ చేయబోతున్నారట. లేటెస్ట్ Rx 100 బైకు త్వరలోనే తీసుకువస్తున్నామని యమహా ఇండియా ఇటీవలే ప్రకటించింది. ఇంతకుముందు ఉన్న 100cc ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ 200cc లేదా అంతకంటే ఎక్కువ డిస్‌ప్లేస్‌మెంట్ పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్ లోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్, రెట్రో-స్టైల్ డిజైన్‌తో కొత్తగా రాబోయే ఈ Rx 100 ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 1 లక్ష వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. LED హెడ్‌లైట్లు, 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో ఈ బైక్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.



Post a Comment

0 Comments

Close Menu