అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు !
Your Responsive Ads code (Google Ads)

అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు !


క్టోబర్ నెల ఆటోమొబైల్ కంపెనీలకు బాగా కలిసొచ్చింది. రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు కొనసాగాయి. అందులోనూ ప్యాసింజర్ వెహికల్  సెగ్మెంట్‌లో అత్యధికంగా ఎస్‌యూవీల అమ్మకాలు జరిగాయి. ఆటోమోటివ్ విక్రయాల్లో అనేక ఎస్‌యూవీలు టాప్ 10 జాబితాలోకి ప్రవేశించాయి. మార్కెట్లోకి ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ వదిలిన కార్ల తయారీదారులు అదే జోరును ఎస్‌యూవీ విక్రయాలను కొనసాగించారు. అయితే, హ్యాచ్‌బ్యాక్ సేల్స కూడా భారీగా పెరిగాయి. ఎప్పటిలాగే, మారుతి సుజుకి టాప్ 10 జాబితాలో నిలవగా.. అందులో ఆరు మోడళ్లు మారుతివే కావడం విశేషం. మారుతి సుజుకి వరుసగా 22,080 యూనిట్లు, 20,598 యూనిట్లను విక్రయించి 23 శాతం, 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్, స్విఫ్ట్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత టాటా నెక్సాన్ 16,887 యూనిట్లను విక్రయించి 23 శాతం వృద్ధిని నమోదు చేసి మూడవ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్, బ్రెజ్జాతో వరుసగా 16,594 యూనిట్లు, 16,050 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి కింది రెండు స్థానాలను ఆక్రమించింది. మారుతి సుజుకి బ్రెజ్జా 61 శాతం వృద్ధిని సాధించింది. బాలెనో మాత్రం 3 శాతం వృద్ధిని సాధించింది. ఆరో స్థానంలో టాటా పంచ్ ఉంది. ఆ తర్వాత మరో రెండు మారుతి సుజుకి మోడల్స్ డిజైర్, ఎర్టిగా ఉన్నాయి. టాటా గత నెలలో పంచ్ 15,317 యూనిట్లను విక్రయించింది. దాంతో 39 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారుతి సుజుకి 14,699 డిజైర్, 14,209 ఎర్టిగా యూనిట్లను విక్రయించింది. మహీంద్రా స్కార్పియో 13,578 యూనిట్లను విక్రయించి 83 శాతం వృద్ధితో 9వ స్థానంలో నిలిచింది. టాప్ 10 అమ్మకాల వాహనాలలో చివరి రెండు వాహనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివరగా, అక్టోబర్ 2023లో 13,077 యూనిట్లు విక్రయించిన హ్యుందాయ్ క్రెటా 10వ స్థానంలో నిలిచింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog