Ad Code

గూగుల్ నుంచి యాపిల్‌కు ఏటా రూ.100 కోట్లు చెల్లింపు !


ఫోన్లలో డీఫాల్ట్ బ్రౌజర్‌గా గూగుల్‌ను ఉంచేందుకు తాము ఏటా యాపిల్ కంపెనీకి డబ్బులు చెల్లిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. యాపిల్ కంపెనీ సొంత వెబ్ బ్రౌజర్‌ 'సఫారీ' ద్వారా జరిగే గూగుల్ సెర్చ్‌లలో వచ్చే ఆదాయంలో 36 శాతాన్ని యాపిల్ కంపెనీకే ఇస్తున్నామని తెలిపారు. ఈ అమౌంట్ సంవత్సరానికి దాదాపు రూ.100 కోట్ల దాకా ఉంటుందన్నారు. వాషింగ్టన్ డీసీ కోర్టులో జరుగుతున్న గూగుల్ యాంటీ ట్రస్ట్ కేసు విచారణ సందర్భంగా ఈ వివరాలను గూగుల్ తెలిపిందని అంటున్నారు. ఇక శాంసంగ్ ఫోన్లలో గూగుల్‌ను డీఫాల్ట్ బ్రౌజర్‌గా ఉంచుతున్నందుకు దానికి కూడా ఏటా దాదాపు రూ.50 కోట్ల దాకా గూగుల్ చెల్లిస్తోందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ డీసీ కోర్టులో గూగుల్ రెండు యాంటీ ట్రస్ట్ కేసులను ఎదుర్కొంటోంది. తమ గేమింగ్ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యూజర్స్‌కు డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో గూగుల్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని, గుత్తాధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తోందంటూ 'ఎపిక్ గేమ్స్' ఒక కేసు వేసింది. మరోవైపు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ మార్కెట్‌లో గూగుల్‌ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్ సెర్చ్ ఇంజన్, వంటి మరిన్ని పక్షాలతో మరో కేసు కూడా గూగుల్‌పై నడుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu