విండోస్ 11 యూజర్ల కోసం ప్రముఖ మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త అప్‌డేట్ ప్రకటించింది. విండోస్ కోపైలట్, ఏఐ- పవర్డ్ పెయింట్, ఆల్-న్యూ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ మరిన్ని వంటి అనేక కొత్త ఫీచర్లను మైక్రోసాఫ్ట్ ప్రకటించిన తర్వాత ఈ కొత్త అప్‌డేట్ వస్తుంది. కొత్త అప్‌డేట్ విండోస్ 11 యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంది. కొన్ని సాధారణ దశల్లో ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివరణాత్మక బ్లాగ్ పోస్ట్‌లో.. వినియోగదారులు కొత్త అప్‌డేట్‌ను ఎలా పొందవచ్చో మైక్రోసాఫ్ట్ వివరించింది. విండోస్ 11, వెర్షన్ 22H22లో రన్ అవుతున్న డివైజ్‌లను కలిగి ఉన్నవారు ఉచితంగా అప్‌డేట్ పొందవచ్చు. వారు చేయాల్సిందల్లా Settings వెళ్లి విండోస్ ఎంచుకోండి. ఆపై, 'లేటెస్ట్ అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్న వెంటనే పొందండి”ని ఆన్ చేసి 'Check for updates' ఎంచుకోండి. మీ PC అప్‌డేట్ కోసం రెడీగా ఉంటే.. మీరు 'Update Now' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ కొత్త అప్‌డేట్ దానితో పాటు ఫీచర్లను కూడా రివీల్ చేసింది. కంపెనీ అప్‌డేట్‌ను 'స్కోప్డ్, క్యుములేటివ్ రిలీజ్' అని పేర్కొంది. ఇందులో కొన్ని కొత్త అప్‌గ్రేడ్‌లతో పాటు ఇటీవల ప్రకటించిన అన్ని ఫీచర్‌లు ఉన్నాయి. 'చాట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Free), టాస్క్‌బార్‌కి డిఫాల్ట్‌గా పిన్ అయింది. మీరు మైక్రోసాఫ్ట్ టీమ్‌లను లాంచ్ చేసేందుకు క్లిక్ చేసినప్పుడు, మీరు చాట్ చేయడం, కాల్ చేయడం, కలవడం, కమ్యూనిటీ గ్రూపుల కోసం స్పేస్‌ను క్రియేట్ చేసే షార్ట్ కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. దీనికి అదనంగా, అప్‌డేట్ మీ అప్లికేషన్‌లను మేనేజ్ చేసే విధానాన్ని కూడా మారుస్తుంది. విండోస్ 11 సిస్టమ్ భాగాలు 'సిస్టమ్' లేబుల్‌ను కలిగి ఉంటాయి. సెట్టింగ్‌లలో కొత్త సెక్షన్‌లో ఉంటుంది. ఈ యాప్‌లను మేనేజ్ చేయడం, అన్‌ఇన్‌స్టాల్ చేసేందుకు వీలుగా ఉంటుంది.
మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఫ్రీ అప్‌డేట్ !
0
November 02, 2023
Tags