ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీ కారణంగా ఎదురవుతున్న చెడు పరిణామాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ వారం మొదట్లో డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖ నటి రష్మిక మందన్న నకిలి వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ నకిలీ వీడియోపై నటి రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. డీప్‌ఫేక్ టెక్నాలజీతో స్నేహితుడి వలే వీడియో కాల్ చేసి, తనకు కొంత డబ్బు అవసరం ఉందని, వెంటనే పంపాలని కోరాడు. అయితే ఈ కాల్ నిజమని నమ్మిన ఓ వ్యక్తి రూ.40 వేల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఈ తాజా ఘటనలో డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కోల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ రాధాకృష్ణన్‌కు జులై 9న ఉదయం వరుసగా కొన్ని వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. తాను వేణుకుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. రాధాకృష్ణన్, వేణుకుమార్ కోల్ ఇండియాలో పనిచేస్తున్న సమయం నుంచి స్నేహితులు. ఈ కాల్‌లో భాగంగా కుటుంబ సహా ఇతర విషయాలు పంచుకున్నారు అనంతరంతన సోదరికి ఆపరేషన్ చేసేందుకు రూ.40 వేలు కావాలని వేణుకుమార్ కోరాడు. తొలుత రాధాకృష్ణన్ కొంత అనుమానం వ్యక్తం చేసినా వీడియో కాల్ చేయడంతో అనుమానం నివృత్తి అయింది. దీంతో వెంటనే గూగుల్ పే ద్వారా రూ.40 వేల నగదును బదిలీ చేశాడు. అయితే మరో 35 రూపాయలు కావాలని మరోసారి ఫోన్ చేయగా.. రాధాకృష్ణన్‌కు అనుమానం వచ్చింది. దీంతో తన వద్దనున్న వేణుకుమార్ ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. దీంతో ఇదంతా మోసంగా తెలుసుకున్న రాధాకృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 4 నెలల విచారణ అనంతరం కోజికొడ్ పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ నిందితుడు గుజరాత్‌కు చెందిన వాడిగా గుర్తించారు. అయితే అహ్మదాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. కోల్ ఇండియా మాజీ ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్ నుంచి నిందితులు రాధాకృష్ణన్ సహా అతని స్నేహితుల వివరాలను సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. డీప్‌ఫేక్ టెక్నాలజీ ఆధారంగా రాధాకృష్ణన్ స్నేహితుడి మాదిరిగా మాట్లాడారు. దీంతో నిజమని నమ్మన రాధాకృష్ణన్ నగదును బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే రాధాకృష్ణన్‌ను అందుకున్న నగదు అహ్మదాబాద్‌లోని ఓ బ్యాంకు ఖాతాకు బదిలీ అయిందని. ఆ సమాచారం ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం !
0
November 11, 2023
Tags