జీబ్రానిక్స్ ఈరోజు కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ జీబ్రానిక్స్ జెడ్ఈబీ-పిక్స్ ప్లే 2 ని మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ 160 ఇంచ్ అతిభారీ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. ఈ కొత్త ప్రొజెక్టర్ ను మంచి బ్యాంక్ ఆఫర్స్, నో కాస్ట్ కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లతో కూడా అందించింది. ఈ ప్రొజెక్టర్ ధర రూ. 13,999. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ని 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కన్నా తక్కువ రేటుకే అందించింది. ఈ కొత్త ప్రొజెక్టర్ ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. జీబ్రానిక్స్ జెబ్ - పిక్స్ ప్లే 24 స్మార్ట్ ప్రొజెక్టర్ Full HD 1080p రిజల్యూషన్ కలిగి 160 ఇంచ్ స్క్రీన్ సైజు వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను గోడకు లేదా స్క్రీన్ కు పెట్టిన దూరాన్ని బట్టి పిక్చర్ ను సరిచేసే ఆటో కీస్టోన్ అడాప్షన్ మరియు ఆటో ఫోకస్ టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ లో HDMI, USB, Aux అవుట్ మరియు HDMI Arc పోర్ట్ లతో పాటు బ్లూటూత్, ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ చాలా కాంపాక్ట్ సైజులో ఇన్ బిల్ట్ స్పీకర్ మరియు ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా క్యారీ స్ట్రాప్ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, స్మార్ట్ ఫోన్ ను ఈజీగా కనెక్ట్ చేసే మీరా క్యాస్ట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ జీబ్రానిక్స్ ప్రొజెక్టర్ 4000 లుమెన్స్ లైట్ తో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.
0 Comments