విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ రైల్లో ఓ ఆకతాయి యువతిపై లైంగిక దాడి చేశాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో రైలు కంపార్ట్ మెంట్ లో అందరూ గాఢ నిద్రలో ఉండగా ఓ విద్యార్థిని ప్రైవేట్ పార్ట్స్ పైన యువకుడు చేతులు వేశాడు. వెంటనే ఆ విద్యార్థిని గట్టిగా అరిచిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతణ్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ కంపార్ట్ మెంట్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) నాయకులు అలెర్ట్ అయ్యి అతణ్ని పట్టుకున్నారు. యువతి అర్ధరాత్రి రైలులోని వాష్ రూంకు వెళ్లడం చూసిన యువకుడు ఆమె వచ్చే వరకూ అక్కడే కాపు కాసినట్లు చెబుతున్నారు. ఆమె బయటికి రాగానే యువతి ప్రైవేటు పార్ట్స్పై చేతులు వేశాడు. రైలు నెంబరు 12864లోని ఎస్ 6 కంపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. ఏఐఎస్ఎఫ్ నాయకులు దగ్గరుండి మరి విశాఖపట్నంలో ఉదయం ఐదున్నర గంటలకు నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఆ అతనిపై కేసు నమోదు చేయించామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ తెలిపారు. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని ఎం సాయికుమార్ డిమాండ్ చేశారు.
0 Comments