Ad Code

బాక్సాఫీస్ దగ్గర కోట్లు కుమ్మరిస్తున్న 'కమిటీ కుర్రోళ్లు' !


కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్‌లో బ్లాక్ బస్టర్‌లు కొడుతుంది. కమిటీ కుర్రోళ్లు సినిమా అదే రేంజ్‌లో దూసుకుపోతుంది. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రంలో చక్కగా తెరకెక్కించారని అందరూ ప్రశంసిచారు. ప్రశంసలతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. రెండు రోజుల్లోనే కమిటీ కుర్రోళ్లు సినిమా రూ. 3.69 కోట్లను రాబట్టింది. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని, ఇక వీకెండ్స్ అయిన శనివారం, ఆదివారం రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి.


Post a Comment

0 Comments

Close Menu