హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. తెలంగాణాలో పార్టీ పునర్నిర్మాణం పై చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న పార్టీ పదవులు అన్ని రద్దు చేసినట్లు, రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నికకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేలా పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ అందరినీ చూడడానికి ఇక్కడికి వచ్చాను. ముఖ్య మంత్రి అయ్యాక ఒక్కసారే వచ్చాను. మరోసారి ఇక్కడ అందరినీ కలిసి రెండు గంటలు గడుపుదామని వచ్చాను. ఇక్కడ వచ్చిన తరువాత నాకు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ తీసుకున్నాను. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ పార్టీలో పని చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వారందరి కోసం పార్టీ బలపర్చాలని అనుకుంటున్నాము. పార్టీ ఎలా బలపర్చాలనేది ఆలోచన చేస్తున్నాము. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితిలో ఇక్కడ అధ్యక్షున్ని పెట్టలేదు.. ఇక్కడ గత రెండు ఎన్నికలకి దూరంగా ఉన్నాము.. ఊహా జనిత ప్రశ్నలకు సమాధానం చెప్పాను. పార్టీ ని ఎలా బలోపేతం చేయాలని, ప్రజలకు ఎలా సేవలు అందించాలి అనేది ఆలోచిస్తునాం. తెలుగు ప్రజల కోసం నిరంతరం పని చేసిన పార్టీ టీడీపీ. ఆంధ్రపదేశ్ లో వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దానిని దారిలోకి తెచ్చుకోవాలి. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. తెలుగు ప్రజల మనోభావాల కోసం పని చేస్తాము. ఇప్పుడు ఏపీలో ఆలయాలపై దాడులు జరగడం లేదు. గత ప్రభుత్వంలో ఆలయాలపై దాడి చేసిన వారిని పై చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో తెలుగు జాతి ఎదగాలి. విజన్ 2047 కోసం పనిచేస్తాం. 2047 వరకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు ఉన్నత స్థాయిలో ఉండేలా చేయడం నా లక్ష్యం. ఆ రోజు 2024 అని మాట్లాడితే నన్ను 420 అన్నారు. సెల్ ఫోన్ గురుంచి మాట్లాడితే నన్ను హేళన చేశారు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతాయని చంద్రబాబు నాయుడు అన్నారు.
0 Comments