కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మనిషి చెమట నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పరకరాన్ని రూపొందించారు. నిద్ర పోతున్న సమయంలో ఈ గ్యాడ్జెట్‌ను చేతికి ధరిస్తే అది చెమట నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విద్యుత్ సహాయంతో స్మార్ట్ ఫోన్‌లతో పాటు, స్మార్ట్ వాచ్‌లను సులభంగా చార్జ్ చేసుకోవచ్చు. ఇలా 10 గంటల పాటు వేలిపై డివైజ్‌ను ధరిస్తే 24 గంటల పాటు ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చని పరిశోధకుల బృందం చెబుతోంది. అయితే చెమట ద్వారా ఈ డివైజ్ ఛార్జింగ్ అవ్వడం అంత సులభమైన విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ డివైజ్‌ను ఏకంగా మూడు వారాల పాటు చేతి వేళ్లకు ధరిస్తేనే విద్యుత్‌ను ఛార్జ్ చేసే అవకాశం లభిస్తుంది. అయితే భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. చిన్న చిప్ సైజ్‌లో ఉండే ఈ పరికరాన్ని ప్లాస్టర్‌లాగా వేళ్లకు చుట్టుకోవాల్సిన ఉంటుంది. ఇందులోని కార్బన్ ఫోమ్ ఎలక్ట్రోడ్‌ల పాడింగ్ చెమటను గ్రహిస్తుంది. ఇది చెమటను విద్యుత్‌గా మారుస్తుంది. వేళ్ల నుంచి వచ్చే చెమటను తడిసినప్పుడు స్ట్రిప్‌పై ఒత్తిడి ఏర్పడుతుంది. అది విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డివైజ్‌ను పూర్తి స్థాయిలో రూపొందించిన తర్వాత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
0 Comments