Ad Code

వరద బాధితులకు ఏపీ ఉద్యోగులు విరాళంగా రూ. 120 కోట్లు ప్రకటన


ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ఎన్జీవో జేఏసీ భారీ విరాళం ప్రకటించింది. ఈ నెల జీతంలో ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు తమ అంగీకార పత్రాన్ని సీఎం చంద్రబాబుకు అందజేసింది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఏపీ వరద బాధితులకు సాయాన్ని ప్రకటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు స్పందించిన అనేకమంది విరాళాలిచ్చేందుకు ముందుకొస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu